Nandanavanam
-
'ఆ శ్రద్ధ అభివృద్ధిపై లేదు'
హస్తినాపురం : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు ఇచ్చిన ప్రాధాన్యం కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు ఇవ్వడం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. నందనవనం కాలనీలోని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. శుక్రవారం ఆయన కర్మన్ఘాట్ డివిజన్ పరిధిలోని నందనవనం, దేవీనగర్కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. -
నందనవనంలో పోలీసులు విస్తృత తనిఖీలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్పేట మండలం నందనవనంలో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే అనుమానితులకు చెందిన 19 బైకులు 19 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు 200 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన ఈ సోదాలు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. శనివారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతల్లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు పేకాటరాయుళ్లు ఉన్న సంగతి తెలిసిందే.