
ఉస్మానియా ఆస్పత్రిలో కార్డన్‌సెర్చ్
అప్జల్‌గంజ్ (హైదరాబాద్): ఉస్మానియా ఆస్పత్రిలో అప్జల్‌గంజ్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ నేతృత్వంలో చాదర్‌ఘాట్, సుల్తాన్‌బజార్, అప్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్లకు చెందిన దాదాపు 100 మంది పోలీసులు ఈ కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్, ఇన్ పేషెంట్ బ్లాక్‌లతో పాటు అన్ని వార్డులలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియాలో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏసీపీ రావుల గిరిధర్, అప్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు.