వాహనాలు తనిఖీ చేస్తున్న డీఎస్పీ శ్రీధర్
కోస్గి (కొడంగల్): పోలీసు ప్రత్యేక బృందాలు కోస్గిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక్కసారిగా తనిఖీలు జరపడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. ముం దుగా డీఎస్పీ వాహనం, పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలు, వెంటనే డీసీఎంలతో పోలీసు బలగాలు కోస్గికి చేరుకున్నాయి. పోలీసుల హంగామాను చూసి ఏం జరుగుతుందో తెలియక పట్టణ ప్ర జల్లో తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇదంతా పోలీసు శాఖ చేపట్టిన కార్డెన్ సెర్చ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
పేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, 150 మంది సిబ్బందితో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అన్నిరకాల వివరాలు సేకరించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు యువకులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు జరిపిన కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 22 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment