వాజ్‌పేయినగర్‌లో కార్డన్‌సెర్చ్ | cardon search in vajpei nagar | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయినగర్‌లో కార్డన్‌సెర్చ్

Published Sun, Jun 28 2015 5:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

cardon search in vajpei nagar

కుత్బుల్లాపూర్: పేట్‌బషీరాబాద్ పరిధిలోని వాజ్‌పేయినగర్‌లో సైబరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను సీజ్ చేశారు. గతంలో వీరిపై ఏమైనా కేసులున్నాయా..? అన్న విషయంపై ఆరా తీశారు.

జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఎస్‌ఓటీ రామచంద్రారెడ్డి, ఏసీపీలు అశోక్‌కుమార్, నంద్యాల నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, కిష్టయ్యలతో పాటు 12 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బందితో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement