హైదరాబాద్: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠిలో శనివారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. కోఠి ప్రాంతంలోని సుల్తాన్‌బజార్, గుజరాతీ గల్లీ, బ్యాంక్ స్ట్రీట్, హరిద్వార్ గల్లీల్లో ఇళ్లను, వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశారు. 34 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
Published Sat, Jul 9 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement