నంబర్‌ ప్లేట్లపై స్పెషల్‌ డ్రైవ్‌.. కవర్‌ చేస్తే కటకటాలే! | Hyderabad Police Special Checking On Vehicle Number Plates | Sakshi
Sakshi News home page

నంబర్‌ ప్లేట్లపై స్పెషల్‌ డ్రైవ్‌.. కవర్‌ చేస్తే కటకటాలే!

Published Wed, Jan 11 2023 11:56 AM | Last Updated on Wed, Jan 11 2023 12:05 PM

Hyderabad Police Special Checking On Vehicle Number Plates - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనులు నానాటికీ రెచి్చపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్‌ కెమెరాలకు తమ నంబర్‌ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్‌’ చేస్తున్నారు. దీనికోసం మాసు్కలు తదితరాలు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, నేరగాళ్లు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్‌ కాప్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్‌ ప్లేట్స్‌ మూసేసిన వారిపై పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్‌ ప్లేట్‌ను మాసు్కతో కవర్‌ చేసిన యువకుడిని రెయిన్‌బజార్‌ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. ఇతడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.  

చలాన్లు తప్పించుకోవడానికే.. 
- నంబర్‌ ప్లేట్లు మూసేయడం అనేది ప్రధానంగా ఈ–చలాన్లను తప్పించుకోవడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్‌ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నంబర్‌ ప్లేట్లతో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు.  
- ఈ విధానంలో వాహనాల నంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నంబర్‌ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్‌ చేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్‌ నంబర్లు ట్రాఫిక్‌ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబర్‌ ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. 
 
వాహనం వెనుకవే ఎక్కువగా.. 
వాహనాల నంబర్‌ ప్లేట్స్‌ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్‌ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఈ తరహా నంబర్‌ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయతి్నస్తే బైక్స్‌ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఆ తరహా చర్యల జోలికి వెళ్లట్లేదు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్‌ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. 

మాస్క్‌ మాటున మస్కా కొట్టాలని.. 
ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడిపై కొన్నాళ్లుగా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. రెయిన్‌బజార్‌ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం వాహన చోదకుడికి ఎనిమిది రోజుల శిక్షపడింది. నంబర్‌ ప్లేట్‌ ఉల్లంఘనలో ఇంత శిక్షపడటం ఇదే తొలిసారి అని ఇన్‌స్పెక్టర్‌ నైని రంజిత్‌కుమార్‌ గౌడ్‌ ‘సాక్షి’కి తెలిపారు. బాలాపూర్‌నకు చెందిన సయ్యద్‌ షోయబ్‌ అక్తర్‌ అలీకి ఈ శిక్షపడిందని వివరించారు. ఈ తరహా ఉల్లంఘనులపై పోలీసులు ఐపీసీలోని 420 (మోసం), 186 (ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకోవడం) సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. 

నంబర్‌ ప్లేట్లపై స్పెషల్‌ డ్రైవ్‌ 
ఈ నెల 2 నుంచి 9 వరకు చేపట్టిన డ్రైవ్‌లలో నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోవటం, టాంపరింగ్, స్పష్టత లేకుండా చేయడం వంటి 2,925 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. 27,467 విత్‌ అవుట్‌ హెల్మెట్‌ కేసులు, 509 మందిపై 39 (బీ) పెట్టీ కేసులు, 264 మందిపై 41 సీపీ యాక్ట్‌ (వెహికిల్‌ లిఫ్టింగ్‌), 441 మంది వాహనదారులై ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు నమోదు చేశామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement