Vehicle checkings
-
నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్.. కవర్ చేస్తే కటకటాలే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనులు నానాటికీ రెచి్చపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకు తమ నంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం మాసు్కలు తదితరాలు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, నేరగాళ్లు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్‌ను మాసు్కతో కవర్ చేసిన యువకుడిని రెయిన్‌బజార్ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. ఇతడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. చలాన్లు తప్పించుకోవడానికే.. - నంబర్ ప్లేట్లు మూసేయడం అనేది ప్రధానంగా ఈ–చలాన్లను తప్పించుకోవడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నంబర్ ప్లేట్లతో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. - ఈ విధానంలో వాహనాల నంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబర్ ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. వాహనం వెనుకవే ఎక్కువగా.. వాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయతి్నస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఆ తరహా చర్యల జోలికి వెళ్లట్లేదు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ మాటున మస్కా కొట్టాలని.. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడిపై కొన్నాళ్లుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. రెయిన్‌బజార్ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం వాహన చోదకుడికి ఎనిమిది రోజుల శిక్షపడింది. నంబర్ ప్లేట్ ఉల్లంఘనలో ఇంత శిక్షపడటం ఇదే తొలిసారి అని ఇన్స్పెక్టర్ నైని రంజిత్‌కుమార్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. బాలాపూర్‌నకు చెందిన సయ్యద్ షోయబ్ అక్తర్ అలీకి ఈ శిక్షపడిందని వివరించారు. ఈ తరహా ఉల్లంఘనులపై పోలీసులు ఐపీసీలోని 420 (మోసం), 186 (ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకోవడం) సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్ ఈ నెల 2 నుంచి 9 వరకు చేపట్టిన డ్రైవ్‌లలో నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, టాంపరింగ్, స్పష్టత లేకుండా చేయడం వంటి 2,925 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 27,467 విత్ అవుట్ హెల్మెట్ కేసులు, 509 మందిపై 39 (బీ) పెట్టీ కేసులు, 264 మందిపై 41 సీపీ యాక్ట్ (వెహికిల్ లిఫ్టింగ్), 441 మంది వాహనదారులై ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు. -
తనిఖీలు గాయబ్! స్వేచ్ఛగా అసాంఘిక శక్తులు
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో మాదాపూర్‌లోని నీరూస్ జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఇస్మాయిల్‌ను హత్య చేసిన జిలానీతో పాటు ముజాహిద్‌లు ఆదివారం రాత్రి 11.30 నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అక్రమ ఆయుధంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో సంచరించారు. కనీసం ఒక్క చోటైనా వాహనాల తనిఖీలు జరిగి ఉంటే నాటు పిస్టల్‌తో కారులో తిరుగుతున్న వీళ్లు పట్టుబడటమో, పోలీసుల భయంతో తమ పథకం అమలును వాయిదా వేయడమో చేసే వాళ్లు. ఇస్మాయిల్ ప్రాణాలు పోవడం వెనుక తనిఖీలు, సోదాలు గాయబ్ కావడమూ ఓ కారణంగానే కనిపిస్తోంది. అటకెక్కిన ఆ విధానాలు.. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకప్పుడు విస్తృత స్థాయిలో తనిఖీలు, సోదాలు జరిగేవి. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో వాహనాల తనిఖీలో, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లే కనిపించేవి. ఫలితంగా అనేక మంది నేరగాళ్లు, అనుమానిత వ్యక్తులు, చోరీ.. సరైన పత్రాలు లేని వాహనాలు దొరుకుతుండేవి. గడిచిన కొన్నాళ్లుగా మాత్రం ఈ విధానాలన్నీ అటకెక్కాయి. ఎన్నికల సీజన్ లేదా సున్నితమైన పండగలు, ఇతర ఘట్టాలు ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్ల పైకి వస్తున్నారు. మిగిలిన రోజుల్లో కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. పగటి పూట పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం, రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. వీరి దృష్టి ఈ రెండు అంశాలపై కాకుండా మరో దానిపై ఉండట్లేదు. చలాన్ కోసమో, మద్యం తాగాడా? లేదా? అనేది తనిఖీ చేయడానికో ఓ వాహనచోదకుడిని ఆపినప్పుడు వీళ్లు ఇతర అంశాలు పట్టించుకోరు. ఆ వాహనంలో అనుమానాస్పద, నిషేధిత వస్తువులు ఉన్నాయా? సదరు చోదకుడు వీటిని కలిగి ఉన్నాడా? తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం యాంత్రికంగా తమ పని పూర్తి చేసేస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఉన్న వారిలో అనేక మంది గతంలో శాంతిభద్రతల విభాగం, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన వాళ్లే. అయినప్పటికీ ఒంటిపైకి తెల్లచొక్కా వచ్చేసరికి అసలు పోలీసింగ్‌ను మర్చిపోతుంటారు. పగటిపూట రహదారుల్లో వాహన తనిఖీలు చేయడానికి ట్రాఫిక్ జామ్స్ సహా అనేక ఇబ్బందులు ఉంటాయి. అదే రాత్రి వేళల్లో వీటిని చేపట్టినా పెద్దగా ఇబ్బంది రాదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతర విభాగాల విధులతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించకుండా ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు తనిఖీలు, సోదాల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి: మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి -
అవినీతికి అటెండర్
పేరు కొండపల్లి శ్రీనివాస్. చేసేది వాణిజ్యపన్నుల శాఖలో అటెండర్ ఉద్యోగం. అయితేనేం.. వన్‌టౌన్‌లోని వ్యాపారులను హడలెత్తిస్తాడు. కమర్షియల్ ట్యాక్ ఆఫీసర్ తరహాలో ఆయనే వాహనాలను తనిఖీ చేస్తాడు. జీరో వ్యాపారంపై దృష్టిపెట్టి వేలాది రూపాయలు ముడుపులు వసూలు చేస్తాడు. ఓ ఉన్నతాధికారి అండతో కోట్లకు పడగలెత్తి, వ్యాపారులను శాసిస్తున్న ఈ అటెండర్ బాగోతాన్ని కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షి, విజయవాడ: దేశంలోని ప్రధాన నగరాల నుంచి రెడీమేడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర లక్షల రకాల వస్తువులు రైలుమార్గంలోని విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయానికి వస్తాయి. అక్కడి నుంచి ఆ వస్తువులు నగరంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు చేరతాయి. ఈ సరుకులో ఎక్కువ భాగానికి వ్యాపారులు పన్ను చెల్లించరు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖలోని సిబ్బందికి బాగా తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ వన్‌టౌన్‌లో ఉండే కొండపల్లి శ్రీనివాస్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒంటరిగా తనిఖీలు వాణిజ్యపన్నుల శాఖలో వాహనాలు తనిఖీ చేయాలంటే జాయింట్ కమిషనర్ లేదా సీటీవో స్థాయి అధికారి ఆదేశాలతో డీసీటీవో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇవేం అవసరం లేదు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఒక్కడే వాహనాలు తనిఖీ చేస్తాడు. సరకుతో వెళ్తున్న రిక్షాలు, ఆటోలు, వ్యాన్లను ఆపి బిల్లులు తనిఖీ చేస్తాడు. బిల్లులో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే సరకు సీజ్ చేస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు వ్యాపారి కాళ్లబేరానికి వస్తే ముడుపులు తీసుకుని వదిలేస్తాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాడని సమాచారం. ఎవరైనా వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారితో భారీగా జరిమానాలు వేయించగల సమర్థుడు. కేవలం అటెండర్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు డీసీటీవో స్థాయిలో తనిఖీలు చేయడం గమనార్హం. ఒక డివిజన్‌కు చెందిన డీసీటీవోలు మరో డివిజన్ పరిధిలోకి వెళ్లి తనిఖీలు చేయరు. అయితే, డివిజన్–2 పరిధిలోని ఉయ్యూరు సర్కిల్‌కు చెందిన శ్రీనివాస్, డివిజన్–1 పరిధిలోకి వెళ్లి వాహనాలను ఆపడం వ్యాపారులకు విస్మయం కలిగిస్తోంది. తనిఖీలపై వీడియో శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కొంతమంది బాధితులు వీడియోలు, ఫొటోలు తీసి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌తోపాటు జాయింట్ కమిషనర్లకు పంపారు. దీనిపై జాయింట్ కమిషనర్–2 రఘునా«థ్ స్పందిస్తూ ఈ వీడియోపై విచారణ చేయాలని ఉయ్యూరు సీటీవో విజయభాస్కర్‌ను ఆదేశించారు. రంగంలోకి ఉన్నతాధికారి శ్రీనివాస్‌కు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో డివిజన్–2 కార్యాలయంలో పనిచేశారు. ఆ అధికారిపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఆ అధికారి శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తామే తనిఖీలు చేయించామంటూ నివేదిక ఇవ్వాలంటూ డివిజన్–1 కార్యాలయానికి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. విచారణకు ఆదేశించాం కొండపల్లి శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎవరో నాకు వీడియో పంపారు. దాని గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఉయ్యూరు సీటీవోను ఆదేశించాను. ఆదేశాల మేరకే విచారణ చేశారా? ఎప్పుడు చేశారు? పక్కన ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? శ్రీనివాస్ ఒక్కడే తనిఖీలు చేశాడా? అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌ను విచారించి సీటీవో నివేదిక ఇస్తారు. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను. – రఘునాథ్, జాయింట్ కమిషనర్ -
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
-
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠిలో శనివారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. కోఠి ప్రాంతంలోని సుల్తాన్‌బజార్, గుజరాతీ గల్లీ, బ్యాంక్ స్ట్రీట్, హరిద్వార్ గల్లీల్లో ఇళ్లను, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశారు. 34 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
సంగారెడ్డిలో దొంగ అరెస్ట్
సంగారెడ్డి(మెదక్ జిల్లా): సంగారెడ్డి శివారులో జరిపిన వాహన తనిఖీల్లో రాజు గౌడ్ అనే దొంగ పట్టుబడినట్లు మెదక్ ఎస్పీ సుమతీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతని వద్ద నుంచి 56 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, ఒక లాప్టాప్, రూ.5 లక్షల 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.23 లక్షల విలువైన సామగ్రిని వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఖమ్మంనగరంతో పాటు శివారు మండలాల్లో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఖమ్మంనగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్లతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీశ్రీ విగ్రహం వద్ద కారులో కారులో తరలిస్తున్న 260 కిలోల గంజాయి, ఒక చనిపోయిన కుందేలు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం బైపాస్ రోడ్డులో అనుమానంతో 8 మంది మహిళలను, ఒక ఆటోను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 50వ డివిజన్లోని దానవాయిగూడెంలో నల్లబెల్లం, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచ్ర క వాహనాలు, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశ్రీ విగ్రహం, ఎన్టీఆర్ సర్కిల్, ఎన్నెస్పీ విశ్రాంతి భవనం, బోనకల్లు రోడ్డు, కాల్వోడ్డు, తదితర రహదారులతో పాటు మమత ఆస్పత్రి కాల్వకట్ట పరిసరా ల్లో, యుపీహెచ్కాలనీ, బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప, దానవాయిగూడెం, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుం డా వెళ్తున్న గ్రానైట్ లారీని అదుపులోకి తీసుకున్నారు. 52 వాహనాలు సీజ్.. ఖమ్మంలో సరైన పత్రాలు, ఇన్సూరెన్స్, లెసైన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 52 వాహనాలను సీజ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆరువందల మందిచే తనిఖీలు : డీఎస్పీ బాలకిషన్‌రావు ఖమ్మం అర్బన్ : ఖమ్మంసబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారుల్లో 600 మంది పోలీసులు నాకాబంధీ నిర్వహించారని డీఎస్పీ బాలకిషన్‌రావు పేర్కొన్నారు. ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఓఎస్డీ తిరుపతి, తనతో పాటు 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 200 మంది స్పెషల్ పార్టీ, 400 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో మహిళా స్టేషన్ సీఐ ప్రతాప్, అర్బన్ తహశీల్దార్ అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు. 26 వాహనాలు, రూ.6లక్షల నగదు స్వాధీనం నేలకొండపల్లి: జిల్లా సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల్లో కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి,నేలకొండపల్లి ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఓ వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 4లక్షలను, మరో వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 1.76లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 26 వాహనాలను సీజ్ చేశారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ ఆర్.కె.నాయుడు, వెగ్గళం శ్రీధర్‌చారీ, సిబ్బంది మన్సూర్‌ఆలీ, నరసింహారావు, నాగులు, వి.నాగేశ్వరరావు, విజయ్, ఆజమత్ ఆలీ, హోంగార్డ్లు మారగాని రమేష్, ప్రకాష్, శ్రీను పాల్గొన్నారు. చర్లలో .. చర్ల: మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలిరావడంతో వారి మాటున మావోయిస్టు సానుభూతిపనులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. సంతకు వచ్చే ఆదివాసీలతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించి విడుదల చేశారు. ఈ తనిఖీలలో సీఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.