Number plates of vehicles
-
విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..
రోడ్లపై నిత్యం విభిన్న రకాల వాహనాలను గమనిస్తుంటాం. అందులో కొన్ని వెహికిల్స్ నంబర్ప్లేట్లు(Number Plate) సాధారణంగా కాకుండా భిన్నంగా ఉంటాయి. వాటిపై నంబర్లు, రంగులో తేడా ఉండడం గమనిస్తుంటాం. కొన్ని నంబర్ప్లేట్లు తెలుపు రంగులో ఉంటే, మరికొన్ని ఆకుపచ్చ రంగులో, ఇంకొన్ని పసుపు రంగులో.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. అయితే ఒక్కో రంగు ప్లేట్ వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.తెలుపు రంగు ప్లేట్ఈ ప్లేట్లను వాణిజ్యేతర వాహనాలకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కనిపిస్తాయి. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఇది ప్రైవేట్ యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు.ఆకుపచ్చ నంబర్ ప్లేట్పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్(Green Plate) నంబర్ ప్లేట్లు కేటాయించారు. అవి తెల్లని అక్షరాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఈ-రిక్షాలు, బస్సులు వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు.పసుపు రంగు ప్లేట్పసుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఈ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలను అద్దె కోసం ఉపయోగించుకోవచ్చు.బ్లూ నంబర్ ప్లేట్విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు తెలుపు అక్షరాలతో బ్లూ కలర్ ప్లేట్లు కేటాయిస్తారు.ఎరుపు రంగు ప్లేట్ఎరుపు రంగు ప్లేట్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న వాహనాన్ని సూచిస్తుంది. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది.పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్ఈ ప్లేట్లు సైనిక వాహనాలకు చెందినవి. వాహనం కొనుగోలు చేసిన సంవత్సరంతో పాటు పైకి సూచించే బాణాన్ని కలిగి ఉంటాయి. ఈ నంబరింగ్ సిస్టమ్ రక్షణ మంత్రిత్వ శాఖకు(Defence) ప్రత్యేకమైంది.జాతీయ చిహ్నంతో ఎరుపు రంగు ప్లేట్భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఉపయోగించే వాహనాలు భారత జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు పలకను కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?భారత్ నంబర్ ప్లేట్రాష్ట్రాల మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా భారత్ నంబర్ ప్లేట్‌ను 2021లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేరే రాష్ట్రానికి వెళ్లేటప్పుడు మళ్లీ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, దేశ వ్యాప్తంగా బహుళ కార్యాలయాలు కలిగిన కంపెనీల్లో పని చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్.. కవర్ చేస్తే కటకటాలే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనులు నానాటికీ రెచి్చపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకు తమ నంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం మాసు్కలు తదితరాలు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, నేరగాళ్లు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్‌ను మాసు్కతో కవర్ చేసిన యువకుడిని రెయిన్‌బజార్ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. ఇతడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. చలాన్లు తప్పించుకోవడానికే.. - నంబర్ ప్లేట్లు మూసేయడం అనేది ప్రధానంగా ఈ–చలాన్లను తప్పించుకోవడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నంబర్ ప్లేట్లతో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. - ఈ విధానంలో వాహనాల నంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబర్ ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. వాహనం వెనుకవే ఎక్కువగా.. వాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయతి్నస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఆ తరహా చర్యల జోలికి వెళ్లట్లేదు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ మాటున మస్కా కొట్టాలని.. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడిపై కొన్నాళ్లుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. రెయిన్‌బజార్ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం వాహన చోదకుడికి ఎనిమిది రోజుల శిక్షపడింది. నంబర్ ప్లేట్ ఉల్లంఘనలో ఇంత శిక్షపడటం ఇదే తొలిసారి అని ఇన్స్పెక్టర్ నైని రంజిత్‌కుమార్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. బాలాపూర్‌నకు చెందిన సయ్యద్ షోయబ్ అక్తర్ అలీకి ఈ శిక్షపడిందని వివరించారు. ఈ తరహా ఉల్లంఘనులపై పోలీసులు ఐపీసీలోని 420 (మోసం), 186 (ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకోవడం) సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్ ఈ నెల 2 నుంచి 9 వరకు చేపట్టిన డ్రైవ్‌లలో నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, టాంపరింగ్, స్పష్టత లేకుండా చేయడం వంటి 2,925 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 27,467 విత్ అవుట్ హెల్మెట్ కేసులు, 509 మందిపై 39 (బీ) పెట్టీ కేసులు, 264 మందిపై 41 సీపీ యాక్ట్ (వెహికిల్ లిఫ్టింగ్), 441 మంది వాహనదారులై ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు. -
హైదరాబాద్: ఓరి వీళ్ల వేషాలు తగలెయ్య.. నంబర్ ప్లేట్ ఏదయ్యా! (ఫొటోలు)
-
ఇక షోరూమ్‌లోనే నంబర్‌ప్లేట్..!
సాక్షి, నల్లగొండ: వాహనాలు కొనుగోలు చేసిన చోటే ఇకనుంచి నంబర్ ప్లేట్లను బిగించనున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసిన కార్యాలయంలోనే నంబర్ ప్లేట్లు వేయగా.. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఆర్టీఏ కార్యాలయం నుంచి వాహన షోరూమ్‌లకు బదలాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగితే నంబర్ ప్లేట్లు మాత్రం ఎక్కడైతే వాహనాన్ని కొనుగోలు చేస్తామో అక్కడే బిగించనున్నారు. గత ఇలా.. గతంలో కారు, బైక్, ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు తదితర వాహనాలను షోరూమ్‌లో కొనుగోలు చేసి.. షోరూమ్ పేపర్ల ద్వారా ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. అదే సందర్భంలో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆ వాహనానికి నంబర్‌ను సీరియల్ పద్ధతిలో అలాట్ చేసేవారు. ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ఆ నంబర్‌ను బుక్ చేసుకోవడం, ఎక్కువ మంది అదే నంబర్ కోరుకుంటే డ్రా పద్ధతిన ఎక్కువ రుసుం చెల్లించి పొందాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజుల తర్వాత అలాటైన నంబర్‌ను హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను ఆర్టీఏకు అనుసంధానంలో ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా వాహనాలకు అమర్చేవారు. కొత్త విధానం ఇలా... ప్రస్తుతం ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా షోరూమ్‌లో వెంటనే కొనుగోలుదారుడి పేరును ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దాంతో మొదట టీఆర్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. అప్పుడు ఆన్లైన్ ద్వారానే నంబర్ అలాట్ అయి సంబంధిత షోరూమ్‌కు వస్తుంది. ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ కావాలంటే మాత్రం ఎక్కువ రుసుము చెల్లించాలి. అది హైదరాబాద్ నుంచే నేరుగా సీల్డ్ కవర్లో సంబంధిత షోరూమ్‌కు పంపిస్తారు. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లన్నింటినీ సంబంధిత షోరూమ్‌లకు వస్తాయి. రిజిస్ట్రేషన్ అనంతరం వాహనదారులు షోరూమ్‌కు వెళ్తే నంబర్ ప్లేట్‌ను బిగిస్తారు. ఈ ప్రక్రియ గత నెల నుంచి జిల్లాలో అమలు అవుతోంది. వాహనం ధరలోనే ప్లేట్ రుసుము వినియోగదారుడు ఏ వాహనాన్నైతే కొనుగోలు చేస్తాడో దానికి సంబంధించి నంబర్ ప్లేట్‌కు అయ్యే రుసుమును ముందే చెల్లించాల్సి ఉంటుంది. బైక్‌కు రూ.245, ఆటో రూ.282, కారు రూ.619, లారీ, బస్సు, ఇతర వాహనాలకు రూ.649 చొప్పున వాహన కొనుగోలు ధరలోనే కలిపి వసూలు చేస్తారు. రోజూ అధికంగా రిజిస్ట్రేషన్లు గతంలో కొందరు వాహనాలు కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ విషయంలో ఆలస్యం చేసేవారు. టీఆర్ నంబర్ మీదనే వాహనాన్ని నడిపేవారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచి్చన విధానంతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి్సందే. దీంతో జిల్లా వ్యాపంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్దయెత్తున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. జిల్లాలో రోజుకు 200 పైచిలుకు వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉండేది. -
వీవీఐపీల వాహనాలకూ ఇవి తప్పనిసరి..
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ రిజిస్ర్టేషన్ నెంబర్లు విధిగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారితో పాటు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల వాహనాలకూ రిజిస్ర్టేషన్ నెంబర్లను డిస్ప్లే చేయాలని, సంబంధిత అథారిటీ వద్ద రిజిస్టర్ చేయించాలని పేర్కొంది. అత్యున్నత రాజ్యాంగ పదవులు నిర్వర్తించే వారి వాహనాలపై కేవలం ఇండియా ఎంబ్లమ్కు బదులు రిజిస్ట్రేషన్ నెంబర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు వెల్లడించింది. రిజిస్ర్టేషన్ నెంబర్‌కు బదులు నాలుగు సింహాలతో కూడిన దేశ ఎంబ్లమ్‌ను ప్రదర్శిస్తుండటంతో ఆయా పదవులు చేపడుతున్న వారు ఉగ్రవాదులకు సులభంగా టార్గెట్ అవుతున్నారని ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఎంబ్లమ్ ఉన్న వాహనాలను వీవీఐపీల వాహనాలుగా భావించి పోలీసు అధికారులు పరిశీలించని కారణంగా నేరపూరిత కార్యకలాపాల కోసం ఉగ్రవాదులు, నేరస్తులు ఈ వాహనాలను దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. ఇక రిజిస్ర్టేషన్ నెంబర్ చూపని వాహనాలు చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని కోర్టుకు నివేదించారు. -
ఇక నెంబర్ ప్లేట్లతోనే కార్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఇక నెంబర్ ప్లేట్లు ఫిట్ చేసిన వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. వీటికి అయ్యే వ్యయాన్ని వాహన ధరలోనే కలుపుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వాహన రిజిస్ర్టేషన్ నెంబర్‌తో కూడిన నెంబర్ ప్లేట్లను ఆయా ప్రభుత్వ సంస్థల ద్వారా పొందే వెసులుబాటు ఉంది. అయితే ఇక నుంచీ వాహన తయారీ కంపెనీలు కార్లపై ప్లేట్లను అమరుస్తాయని, వాటిపై నెంబర్‌ను తర్వాత యంత్రంతో నమోదు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. కారు ధరలోనే నెంబర్ ప్లేట్ ధర కలిపి ఉంటుందని, దీంతో వినియోగదారులకు ఊరట లభిస్తుందని చెప్పారు. నూతన టెక్నాలజీ నెంబర్ ప్లేట్లతో ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా వివిధ రాష్ట్రాలు వీటిని వేర్వేరుగా సమకూర్చుకునే క్రమంలో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. భద్రత విషయంలో మాత్రం రాజీపడబోమని సాధారణ వాహనాలకు, లగ్జరీ వాహనాలకు భద్రతా ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. -
నంబర్ ప్లేట్లులో సెక్యూరిటీ!
కర్నూలు నగరానికి చెందిన రఘు తన వాహనానికి బిగించుకున్న హై–సెక్యూరిటీ నంబరు ప్లేటు ఆరు నెలల్లోనే విరిగిపోయింది. నంబరు ప్లేటు లేదనే కారణంగా రూ.135 చలానా భారం పడింది. దీంతో విధిలేక సాధారణ నంబరు ప్లేటును సొంత ఖర్చుతో బిగించుకున్నాడు. ఒక్క రఘునే కాదు..జిల్లావ్యాప్తంగా చాలామంది వాహనదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: హై–సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు నాణ్యత లేకపోవడంతో వాహన దారుల జేబులు గుల్లవుతున్నాయి. వాటిని బిగించుకున్న ఆరు నెలల్లోపే విరిగిపోతున్నాయి. విరిగిన ప్లేట్లతో తిరుగుతున్న వాహనదారులపై అధికారులు చలానాల రూపంలో బాదుతున్నారు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చాలామంది తిరిగి కొత్తగా సాధారణ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి వస్తోంది. హై–సెక్యూరిటీ నంబర్ ప్లేటు కోసం ఒక్కొక్కరు ఇప్పటికే రూ.250 మేర ఖర్చు చేశారు. విరిగిన ప్లేటుతో తిరుగుతూ ఒక్కసారి పట్టుబడితే చలానా రూపంలో రూ.135 వరకూ బాదుతున్నారు. ఈ భారాన్ని తప్పించుకునేందుకు చాలామంది సొంత ఖర్చుతో సాధారణ నంబరు ప్లేట్లను బిగించుకుంటున్నారు. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. హై–సెక్యూరిటీ పేరుతో నాణ్యతలేని నంబరు ప్లేట్లను సరఫరా చేసిన ప్రైవేటు ఏజెన్సీపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు వెనకాడుతున్నారు. ఆ ఏజెన్సీకి అధికార పార్టీకి చెందిన ఎంపీ అండదండలు ఉండటమే ఇందుకు కారణం. ఆది నుంచి విమర్శలే... హై –సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల సరఫరా ఏజెన్సీ మీద మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టెండర్లు పిలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ టెండర్లు తామే పిలుచుకుంటామంటూ అక్కడ ఆందోళన జరిగింది. దీంతో ఏపీలో మాత్రమే ఈ పథకం అమలు ప్రారంభమయ్యింది. మొదట్లో ఆర్టీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెట్టారు. ఢిల్లీకి చెందిన లింక్ ఆటోటెక్ అనే సంస్థ హై–సెక్యూరిటీ పేరుతో ఎటువంటి ప్రత్యేకతలూ లేని నంబరు ప్లేట్లను వాహనాలకు బిగిస్తోంది. రవాణా శాఖ అధికారులు సదరు ఏజెన్సీ కార్యాలయానికి ప్రత్యేక గది ఇచ్చి మరీ సహాయం చేస్తున్నారు. ఇక నంబరు ప్లేట్లను కూడా సదరు సంస్థ సకాలంలో సరఫరా చేయలేకపోతోంది. సాధారణ నంబర్ ప్లేట్ల మాదిరిగానే ఉన్న ఇవి మరీ నాసిరకంగా ఉంటున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 150 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఒక్కో నంబరు ప్లేటుకు రూ.250 చొప్పున ప్రతిరోజూ వాహనదారులు రూ.37,500 ఖర్చు చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ.1.37 కోట్ల మేర కేవలం నంబరు ప్లేట్ల కోసమే వెచ్చిస్తున్నారు. ఈ నంబరు ప్లేట్లు కాస్తా త్వరగా విరిగిపోతుండటంతో.. సాధారణ నంబర్ ప్లేట్లకు మరో రూ.కోటి మేర అదనపు భారం పడుతోందని అంచనా. అధికార పార్టీ అండదండలు ఢిల్లీకి చెందిన ఈ ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులకు అధికార పార్టీ నేతలతో సంబంధబాంధవ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాస్తా ఈ సంస్థను వెనకేసుకొస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఎటువంటి నాణ్యత లేకుండా నంబరు ప్లేట్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు జిల్లా రవాణాశాఖ అధికారులు ఇప్పటికే విన్నవించారు. ఈ ఏజెన్సీని మార్చి.. ఆర్టీసీకి కాంట్రాక్టు అప్పగించాలని ఉన్నతాధికారులు కూడా సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వ పెద్దలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. -
ఆ వాహనాలకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రీమియర్ పాలసీ మేకింగ్ బాడీ నీతి ఆయోగ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త రంగులో నెంబర్ ప్లేట్లను రూపొందిస్తోంది. గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లతో ఈ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ డ్రాఫ్ట్ పాలసీ కూడా రూపొందించింది. ఈ పాలసీలో మూడేళ్ల ఉచిత పార్కింగ్, టోల్ రద్దు వంటి వాటిని ప్రతిపాదించినట్టు బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం నివాస స్థలాల వద్ద, షాపింగ్, ఆఫీస్ కాంప్లెక్స్‌లలో 10 శాతం పార్కింగ్ స్థలాని కేటాయించాలని కూడా డ్రాఫ్ట్ పాలసీ ప్రతిపాదించింది. ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఆరు రకాల నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లటి రంగు, నలుపు అంకెలున్న ప్లేట్ల వాహనాలు ప్రైవేట్ అవసరాల కోసం వాడుకునేవి ఉన్నాయి. వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడరు. వాణిజ్య వాహనాలకు బ్లాక్ టెక్ట్స్‌లో పసుపు రంగు ప్లేటు కలిగిఉంటాయి. సెల్ఫ్-డ్రైవ్‌కు అద్దెకు ఇచ్చే వాహనాలకు పసుపు రంగులో నెంబర్లు ఉండి, నలుపు రంగులో ప్లేట్లు ఉంటాయి. వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడినా.. కమర్షియల్ లైసెన్స్ మాత్రం కలిగి ఉండవు. తెల్లటి రంగులో నెంబర్లను, తేలికపాటి నీలి రంగు బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంబాసీ వాహనాలకు వాడతారు. ఎర్రటి రంగు ప్లేట్‌ను దేశాధ్యక్షుడి కారుకి, రాష్ట్రాల గవర్నర్ల కారుకి వాడుతుండగా.. మిలిటరీ వాహనాలకు యూనిక్ నెంబరింగ్ సిస్టమ్ కలిగి ఉండి, మొదటి, మూడో నెంబర్ల స్థానంలో పైకి సూచిస్తున్న బాణం గుర్తు కలిగి ఉంటాయి. ఇలా ఆరు రకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. -
సొంత వాహనాలను బాడుగకు తిప్పితే..
నగరంపాలెం: సొంత నెంబరు ప్లేటు కలిగిన వాహనాలను బాడుగకు తిప్పితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అనేక కార్లు, ఇన్నోవాలు, టవేరాలు, స్కార్పియో తదితర వాహనాలను సొంత నంబరు ప్లేటుతో (వ్యక్తిగత) వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని బాడుగకు తిప్పుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అలాంటి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 286 వాహనాలపై కేసులు నమోదుచేసి రూ.3.92 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. జిల్లాలోని అధికారులు తమ సిబ్బంది వ్యక్తిగత వాహనాలను అద్దె వాహనాలుగా వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత వాహనాలను అద్దె వాహనాలుగా తిప్పుతున్నట్టు సమాచారం తెలిస్తే ఆర్టీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయని తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ రాజరత్నం హెచ్చరించారు. -
AP36 కాదు TS 3
- మారనున్న వాహనాల నంబర్ ప్లేట్లు - జిల్లాలో 2.97 లక్షల వాహనాలు - నాలుగు నెలల గడువు.. మళ్లీ తప్పని తిప్పలు సాక్షి, హన్మకొండ: కొత్త రాష్ట్రంలో కొంగొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని వాహనాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూచించే విధంగా ఉన్న ఏపీ కోడ్ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే విధంగా టీఎస్ (తెలంగాణ స్టేట్) కోడ్ అమలు కానుంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు రవాణా శాఖ కేటాయించిన కోడ్ 36 ఇకపై.. 3గా మారనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. తమ వాహనాలపై ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ స్టేట్‌ను చూసుకోవాలనుకున్న అభిమానుల కల నెరవేరనుంది. ఏపీ 36 బదులు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అక్షరక్రమం ఆధారంగా గతంలో ఉన్న 23 జిల్లాలకు వాహనాల నంబర్‌ప్లేట్లకు ఆంగ్ల అక్షరాలు, అంకెలతో ఉన్న కోడ్లను కేటాయించింది. అందులో వరంగల్ జిల్లాకు ఏపీ 36 కోడ్‌గా అమలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోరుు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన రవాణాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాలకు నంబర్ ప్లేట్ల కోడ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా వాహనాలకు కోడ్‌గా టీఎస్ 3ని కేటాయించారు. ఇకపై కొత్తగా రిజిష్ట్రర్ అయ్యే వాహనాలకు టీఎస్ 3ని కోడ్‌గా కేటాయించనున్నారు. అదేవిధంగా పాతనంబర్ ప్లేట్లలో మార్పులు జరగనున్నాయి. ఉదాహరణకు ఏపీ 36 ఏహెచ్ 225తో ఉన్న నంబర్‌ప్లేట్ కొత్తగా తీసుకున్న నిర్ణయం వల్ల టీఎస్ 3 ఏహెచ్ 225గా మారుతుంది. నాలుగు నెలలు.. మూడు లక్షల వాహనాలు జిల్లాలో అన్ని రకాలు కలిపి దాదాపు 2.97 లక్షల వాహనాలు ఏపీ 36 కోడ్‌తో రిజిష్ట్రర్ అయి ఉన్నాయి. వీటిలో రెండు లక్షల వరకు ద్విచక్ర వాహనాలు, ముప్పైవేల వరకు ట్రాక్టర్లు, 25వేల వరకు కార్లు, మరో 20వేల వరకు ఆటోలు ఉన్నాయి. ఇవి కాకుండా 800 వరకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, పదిహేను వందల స్కూలు బస్సులు ఉన్నాయి. మిగిలిన వాహనాలు గూడ్సు ట్రావెల్స్, ప్యాసింజర్ ట్రావెల్స్‌గా రిజిష్ట్రర్ అయి ఉన్నాయి. కొత్తగా అమల్లోకి వస్తున్న నిర్ణయం వల్ల ఈ వాహనాల నంబర్లు అలాగే ఉన్నప్పటికీ వాటికి కేటాయించిన కోడ్లు మారినందున తప్పని సరిగా నంబర్ప్లేట్లను మార్చాలి. నాలుగు నెలలలోపు ఈ పని చేయాల్సి ఉంటుంది. మళ్లీ దరఖాస్తు.. రవాణాశాఖలో ఆన్లైన్, స్మార్టు సేవలు విస్తృతమైన నేపథ్యంలో నంబర్ల ప్లేట్లను మార్చుకోవడం అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా స్టిక్కరింగ్ సెంటర్లకు వెళ్లి మార్పులు చేసుకునే అవకాశం లేదు. వాహనదారులు తమ నంబర్ ప్లేట్లు మార్చుకునేందుకు వరంగల్, జనగామ, మహబూబాబాద్‌లలో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో తగిన రుసుము చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం రవాణాశాఖ రికార్డులు, కేంద్రీకృత సర్వర్లలో పాతకోడ్ ఏపీ 36 స్థానంలో టీఎస్ 3గా మార్పులు చేపడతారు. నాలుగు లక్షల వాహనాలకు సంబంధించిన రికార్డులను తిరగరాసే పని నాలుగు నెలల సమయంలో పూర్తి చేయడం కష్టం అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా వాహనం కొన్నప్పుడే రిజిష్ట్రేషన్ల కోసం రవాణాశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, ఇప్పుడు ఉన్న పళంగా అన్ని వాహనాల నంబర్ప్లేట్ల మార్పు కోసం తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం, మళ్లీ రుసుము చెల్లించాల్సి రావడం వంటి పనుల పట్ల ఎంతో సమయం వృథా అవుతుందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.