న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రీమియర్ పాలసీ మేకింగ్ బాడీ నీతి ఆయోగ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త రంగులో నెంబర్ ప్లేట్లను రూపొందిస్తోంది. గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లతో ఈ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ డ్రాఫ్ట్ పాలసీ కూడా రూపొందించింది. ఈ పాలసీలో మూడేళ్ల ఉచిత పార్కింగ్, టోల్ రద్దు వంటి వాటిని ప్రతిపాదించినట్టు బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం నివాస స్థలాల వద్ద, షాపింగ్, ఆఫీస్ కాంప్లెక్స్‌లలో 10 శాతం పార్కింగ్ స్థలాని కేటాయించాలని కూడా డ్రాఫ్ట్ పాలసీ ప్రతిపాదించింది. ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఆరు రకాల నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలున్నాయి.
బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లటి రంగు, నలుపు అంకెలున్న ప్లేట్ల వాహనాలు ప్రైవేట్ అవసరాల కోసం వాడుకునేవి ఉన్నాయి. వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడరు. వాణిజ్య వాహనాలకు బ్లాక్ టెక్ట్స్‌లో పసుపు రంగు ప్లేటు కలిగిఉంటాయి. సెల్ఫ్-డ్రైవ్‌కు అద్దెకు ఇచ్చే వాహనాలకు పసుపు రంగులో నెంబర్లు ఉండి, నలుపు రంగులో ప్లేట్లు ఉంటాయి. వాణిజ్య అవసరాల కోసం వీటిని వాడినా.. కమర్షియల్ లైసెన్స్ మాత్రం కలిగి ఉండవు. తెల్లటి రంగులో నెంబర్లను, తేలికపాటి నీలి రంగు బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంబాసీ వాహనాలకు వాడతారు. ఎర్రటి రంగు ప్లేట్‌ను దేశాధ్యక్షుడి కారుకి, రాష్ట్రాల గవర్నర్ల కారుకి వాడుతుండగా.. మిలిటరీ వాహనాలకు యూనిక్ నెంబరింగ్ సిస్టమ్ కలిగి ఉండి, మొదటి, మూడో నెంబర్ల స్థానంలో పైకి సూచిస్తున్న బాణం గుర్తు కలిగి ఉంటాయి. ఇలా ఆరు రకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment