
సాక్షి, న్యూఢిల్లీ : ఇక నెంబర్ ప్లేట్లు ఫిట్ చేసిన వాహనాలు మార్కెట్‌లోకి రానున్నాయి. వీటికి అయ్యే వ్యయాన్ని వాహన ధరలోనే కలుపుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వాహన రిజిస్ర్టేషన్ నెంబర్‌తో కూడిన నెంబర్ ప్లేట్లను ఆయా ప్రభుత్వ సంస్థల ద్వారా పొందే వెసులుబాటు ఉంది. అయితే ఇక నుంచీ వాహన తయారీ కంపెనీలు కార్లపై ప్లేట్లను అమరుస్తాయని, వాటిపై నెంబర్‌ను తర్వాత యంత్రంతో నమోదు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
కారు ధరలోనే నెంబర్ ప్లేట్ ధర కలిపి ఉంటుందని, దీంతో వినియోగదారులకు ఊరట లభిస్తుందని చెప్పారు. నూతన టెక్నాలజీ నెంబర్ ప్లేట్లతో ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా వివిధ రాష్ట్రాలు వీటిని వేర్వేరుగా సమకూర్చుకునే క్రమంలో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. భద్రత విషయంలో మాత్రం రాజీపడబోమని సాధారణ వాహనాలకు, లగ్జరీ వాహనాలకు భద్రతా ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment