DCP Ravinder
-
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
-
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠిలో శనివారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. కోఠి ప్రాంతంలోని సుల్తాన్‌బజార్, గుజరాతీ గల్లీ, బ్యాంక్ స్ట్రీట్, హరిద్వార్ గల్లీల్లో ఇళ్లను, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశారు. 34 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
అఫ్జల్‌గంజ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాంబాగ్, పూసలబస్తీ, సుందర్బాగ్లో శనివారం రాత్రి ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటింటి వెళ్లి సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. దాదాపు 200 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్, 51 వాహనాలు స్వాధీనం
-
కార్డన్ సెర్చ్, 87 వాహనాలు స్వాధీనం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి తూర్పు మండలం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాణికేశ్వర్‌నగర్‌లోని పలు షాపులు, ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పది మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకన్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా పత్రాలులేని 87 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధ్రువపత్రాలు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్లుగా ఆస్పత్రిని నడుపుతున్న నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్‌రావు, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య
వెంటాడి దాడి చేసిన దుండగులు సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి లక్డీకపూల్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం మహ్మద్ సోహెల్‌గా అనుమానిస్తున్న వ్యక్తి అర్ధరాత్రి సమయంలో టీఎస్11ఈబీ5112 ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్నాడు. వెనుక నుంచి వాహనంలో వెంబడించిన దుండగులు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో సోహెల్ కిందపడిపోయూడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురుగా ఉన్న సంధ్య రెస్టారెంట్లోకి పరుగులు తీశాడు. వెంటవచ్చిన దుండగులు రాడ్లతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, డీఐ ప్రకాశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని జేబులో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మృతదేహం సమీపంలో సెల్‌ఫోన్ కూడా లభ్యమైంది. బండిలోని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తున్నారు. హోటల్ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అప్పు తీర్చమన్నాడని హత్య
వ్యాపారి ప్రాణం తీసిన స్నేహితుడు గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు నలుగురు నిందితుల అరెస్టు సుల్తాన్‌బజార్ : తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించమన్నాడని కక్షగట్టిన ఓ వ్యాపారి తోటి వ్యాపారిని అతిదారుణంగా నరికి చంపాడు. గంటల వ్యవధిలో నలుగురు నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... కింగ్‌కోఠికి చెందిన షేక్ ఖాదర్‌పాషా కింగ్‌కోఠిలో స్పీడ్ మోటార్స్ పేరిట సెకండ్ హ్యాండ్ బైక్‌ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇదే బిజినెస్ చేసే రాంకోఠికి చెందిన సర్పరాజుద్దీన్ అలియాస్ డాక్టర్(28) స్నేహితుడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా డబ్బు విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖాదర్‌కు సర్పరాజుద్దీన్ కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బు గురించి తరచూ తనను అడుతుండటంతో ఖాదర్‌ను హత్య చేయాలని సర్పరాజుద్దీన్ నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి వస్తే డబ్బు ఇచ్చేస్తానని ఆదివారం రాత్రి ఖాదర్‌కు ఫోన్ చేశాడు. రాత్రి 11 గంటలకు సర్పరాజుద్దీన్ ఇంటికి ఖాదర్ తన కారులో వెళ్లాడు. అప్పటికే వేట కోడవలి, ఇనుపరాడ్‌తో సిద్ధంగా ఉన్న సర్పరాజుద్దీన్, అతని తమ్ముడు సయ్యద్‌సాహెబ్ హష్మీ (26) కారు దిగుతున్న ఖాదర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తర్వాత కింగ్‌కోఠికి చెందిన తమ స్నేహితుడు మహ్మద్ సాహెబ్ (23)తో కలిసి బైక్‌పై పారిపోయారు. సమాచారం అందుకున్న డీసీపీ రవీందర్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ రావుల గిరిధర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఖాదర్‌ను హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలించి సోమవారం మధ్యాహ్నం ఎంజీబీఎస్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీం, సుల్తాన్‌బజార్ పోలీసులను డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, అదనపు డీసీపీ చంద్రశేఖర్, సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు.