కార్డన్ సెర్చ్, 87 వాహనాలు స్వాధీనం | cordon search and 87 vehicles recoverd in ou police station region | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్, 87 వాహనాలు స్వాధీనం

Published Fri, Nov 6 2015 10:34 PM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM

cordon search and 87 vehicles recoverd in ou police station region

ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి తూర్పు మండలం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాణికేశ్వర్‌నగర్‌లోని పలు షాపులు, ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పది మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకన్నారు.  వాహనాల తనిఖీలలో భాగంగా పత్రాలులేని 87 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 ధ్రువపత్రాలు లేకుండా ఆర్‌ఎంపీ డాక్టర్లుగా ఆస్పత్రిని నడుపుతున్న నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్‌రావు, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement