మలక్‌పేట్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ప్రాంతాలో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు బలగాలతో జల్లెడ పట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా... సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, రెండు సిలీండర్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట ఏసీపీ సుధాకర్, సీఐ గంగారెడ్డి, డీఐ గుజ్జ రమేష్, డీఎసై ్స నరేష్, ఎస్సైలు రమేష్, రంజిత్‌కుమార్, వెంకట్రామ్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.