శిరీషది ముమ్మాటికీ హత్యే
- కుటుంబసభ్యుల ఆరోపణ
- ఆమె శరీరంపై ఉన్న గాయాలే ఇందుకు సాక్ష్యం
ఆచంట: బ్యూటీషియన్ ఆరుమల్లి విజయలక్ష్మి (శిరీష) మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఆత్మహ త్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో ఉంటు న్న ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం మీడి యా ముందుకు వచ్చారు. శిరీష తల్లి రామ లక్ష్మి మాట్లాడుతూ.. తన కుమార్తె మృతి కేసును పోలీసులు నీరు గారుస్తున్నారన్నారు. ‘నా కూతురు ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదు..’ అని రామలక్ష్మి అన్నారు.
తేజస్వినిని ఎందుకు విచారించలేదు?
స్టూడియో యజమాని రాజీవ్‌ను వివాహం చేసుకోవాల్సిన తేజస్వినిని ఇప్పటివరకు ఎం దుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నిం చారు. ప్లాస్టిక్ తాడును మెడకు బిగించినట్టు శిరీష మృతదేహంపై గుర్తులున్నాయన్నారు. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసు కుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదని ప్రశ్నించారు. రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకా రమే శిరీషను స్టూడియోకు తీసుకెళ్లి మెడకు వైరు బిగించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు.
కట్టు కథలు చెబుతున్నారు
రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకారం శిరీషను చంపేశారు. ఆమె తలపై, చెంపలు, పెదవులమీ దున్న గాయాలే ఇందుకు సాక్ష్యం. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్క దారి పట్టిస్తున్నారు. వారి మాటలన్నీ కట్టుక థల్లా ఉన్నాయి. – శిరీష అత్త శారద, మామ వెంకటేశ్వర రావు