ramalakshmi
-
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
జన్మభూమి కమిటీపై అలుపెరగని పోరాటం
ద్వారకాతిరుమల: గత టీడీపీ జన్మభూమి కమిటీ నిర్వాకం కారణంగా వ్యవసాయ భూమిని కోల్పోయిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంకు చెందిన బంటుమిల్లి రామలక్ష్మి అలుపెరుగని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. భూవివాద సమయంలో సంభవించిన తన భర్త మృతి ముమ్మాటికీ జన్మభూమి కమిటీ చేసిన హత్యేనని ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ (న్యూఢిల్లీ)ను ఆశ్రయించారు. దాంతో సదరు కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈనెల 18న ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 1981లో పావులూరివారిగూడెంలో భూస్వామి దేవరపల్లి హనుమంతరావు వద్ద లాండ్ సీలింగ్‌లో అధికంగా ఉన్న 16.44 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఆ భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున, మరో వ్యక్తికి 44 సెంట్లు ఇచ్చారు. అందులో బంటుమిల్లి సుబ్బారావు ఎకరం భూమిని పొందారు. అయితే హనుమంతరావు తన వద్ద ప్రభుత్వం అధిక భూమిని సేకరించిందని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు 2012లో 7.80 ఎకరాల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భూమిని కోల్పోయే లబ్ధిదారులకు మరోచోట భూమిని కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో హనుమంతరావుకు రెవెన్యూ అధికారులు భూమిని తిరిగి వెనక్కిచ్చారు గానీ, బాధితులకు ఏవిధమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించలేదు. అడ్డగోలుగా జన్మభూమి కమిటీ నిర్ణయం ఇదిలా ఉంటే 2015 నవంబర్ 27న టీడీపీ జన్మభూమి కమిటీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పటికే సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. దాంతో అప్పటి నుంచి గ్రామంలో భూ వివాదాలు, కొట్లాటలు మొదలయ్యాయి. సుబ్బారావుకు హైకోర్టులో సైతం అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. అదేరోజు అతడు మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య రామలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు సుబ్బారావు మృతికి సంబంధించి పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో విచారణ చేపట్టింది. పోలీస్, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కమిషన్ ఆదేశించింది. సుబ్బారావు మృతిపై పునఃవిచారణ చేపట్టాలని కూడా డీఎస్పీ పైడేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బాధితులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించారు. కాగా పోలీసులు సమర్పించిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు ఈనెల 18న కమిషన్ చేపట్టిన విచారణకు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల తహసీలా్దర్ పి.సతీష్, ఎస్సై టి.సుధీర్‌లు హాజరై, తమ నివేదికను సమర్పించారు. దీనిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషన్ కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుని, నివేదికను సమర్పించాలని కమిషన్ మెంబర్ సుభాష్ రాంనాథ్ పార్ధీ ఆదేశించారు. న్యాయం జరుగుతుంది: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రామలక్ష్మి తెలిపారు. నా భర్త సుబ్బారావు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి వీర్రాజుకు తగిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు. -
ఆమె ప్రతి అక్షరం స్త్రీ పక్షం
తెలుగు సాహిత్యలోకం నుంచి రచయిత్రి కె.రామలక్ష్మి (92) వీడ్కోలు తీసుకున్నారు. రచయిత్రిగా, ఆరుద్ర సతీమణిగా, మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగువారి ప్రతినిధిగా, నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా, సినిమా రంగంలో రచయిత్రిగా ఆమె సాగించిన యాత్ర సుదీర్ఘమైనది. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రకు మిగిలిన ఆఖరు సాక్షి లేకుండా పోయినట్టయ్యింది. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌లో ఉన్న నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కోటనందూర్‌లో 1930 డిసెంబర్ 31న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. 1954లో ప్రముఖ కవి ఆరుద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. 1951 నుంచే రామలక్ష్మి రచనా ప్రస్థానం మొదలైంది. వివాహమైన తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. మొత్తం 100 కు పైగా పుస్తకాలు రాశారు. ఆంధ్రపత్రికలో ఆమె సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ప్రశ్న జవాబు’ శీర్షిక ప్రసిద్ధి చెందింది. విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పాండురంగని ప్రతిజ్ఞ, నీదే నా హృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథా సంకలనాలను రామలక్ష్మి రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకుగాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు... రామలక్ష్మి పలు సినిమాలకు కథలు అందించారు. 1975వ సంవత్సరంలో జీవనజ్యోతి సినిమా కథకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్ర దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డు అందుకున్నారు. పలు స్త్రీ సంక్షేమ సంఘాల్లో సేవలు అందించి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ రీజనల్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. రామలక్ష్మి ఆరుద్ర మృతిపట్ల పలువురు రచయితలు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రమే ఎస్ఆర్నగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. స్టెల్లా మేరీ స్టూడెంట్ స్వస్థలం కాకినాడ అయినా కె.రామలక్ష్మి చదువు చెన్నైలోనే సాగింది. స్టెల్లా మేరీ కాలేజీలో చదువుకుని ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించారు. ‘ఐ యామ్ ఏ స్టెల్లామేరియన్’ అని గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రఖ్యాత జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ఇచ్చిన కె.రామలక్ష్మిని చూసి పరీక్షలు అయిపోయాక తనని కలవమని చెప్పారు. ‘స్వతంత్ర’ పత్రికలో ఇంగ్లిష్ విభాగంలో పాత్రికేయురాలిగా ఉద్యోగం ఇచ్చారు. ‘తెలుగు స్వతంత్ర’కు ఎడిటర్‌గా ఉన్న ఖాసా సుబ్బారావు కోరిక మేరకు ‘నడుస్తున్న చరిత్ర’ కాలమ్ రాశారు రామలక్ష్మి. ఆమె ఇంటిలో ప్రతి సాయంత్రం సాహితీచర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ తదితరులు హాజరయ్యేవారు. ఆరుద్ర, రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి ఆ రోజుల్లో అంటే 1954ఏప్రిల్30న రిజిస్టర్డ్ మేరేజీ చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు చేశారు. శ్రీశ్రీ తన పెళ్లికి సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర భావించడం వల్ల ఇది జరిగింది. శ్రీశ్రీ రామలక్ష్మిని ‘అత్తగారు’ అని సరదాగా పిలిచేవారు. అయితే శ్రీశ్రీ ధోరణిని రామలక్ష్మి చివరి వరకూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆరుద్రకు అండా దండా ఆరుద్ర సినిమా రంగంలో కృషి చేయడానికి, ‘సమగ్రాం«ధ్ర చరిత్ర’ పరిశోధన పూర్తి చేయడానికి రామలక్ష్మి అందించిన అండదండలే కారణం. వీరికి ఐదుగురు కుమార్తెలు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి. వీరి పెంపకం, చదువు బాధ్యతలకోసం ఆరుద్ర సమయాన్ని తీసుకోకుండా ఆమే తన సమయమంతా వెచ్చించారు. ‘ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కోసం విపరీతంగా సమయం ఇవ్వాలనుకునేవాడు. కాని ఇల్లు గడవాలి కదా. సినిమా రంగంలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని నేనేమి అనకుండా గబగబా కొన్ని పాటలు రాసేసి ఆ డబ్బు అప్పజెప్పి మళ్లీ పరిశోధనలో పడేవాడు’ అన్నారు రామలక్ష్మి. ఆరుద్రకు అనారోగ్యం వస్తే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూశారామె. ‘నేను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు’ అని ఆరుద్ర కోరడం వల్ల 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి ఆ తర్వాతే మరణవార్తను లోకానికి తెలియచేశారు. ఇది సాహిత్య ప్రియులను బాధించినా రామలక్ష్మి ధోరణి అలాగే ఉండేది. సినిమా రచయిత్రి కె.రామలక్ష్మికి సినిమా రంగంలో అందరూ సుపరిచితులు స్నేహితులు. వారిలో భానుమతి రామకృష్ణ, జయలలిత, వాణిశ్రీ తదితరులు ఉన్నారు. కె.విశ్వనాథ్ తీసిన ‘జీవనజ్యోతి’ సినిమాకు రామలక్ష్మి కథను అందించారు. ఈ సినిమా నిజానికి వాణిశ్రీ కోసమే రాశారు. కె.రామలక్ష్మి రాశారని వాణిశ్రీ నటించారు. దీని నిర్మాణ సమయంలో విశ్వనాథ్‌కు, రామలక్ష్మికి వాదోపవాదాలు నడిచాయి. దాంతో కె.విశ్వనాథ్ విజయవాడలో జరిగిన శతదినోత్సవంలో ‘ఇకపై ఇతరులు రాసిన కథలతో నేను సినిమాలు తీయను’ అని ప్రకటించారు. రామలక్ష్మి రాసిన మరో సినిమా ‘గోరింటాకు’. అయితే దీని మీద ఆ రోజుల్లో వివాదం చెలరేగింది. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్మెంట్లో తెర వెనుక ఉండి పని చేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె 1970లలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పని చేశారు. స్త్రీ పక్షపాతి రామలక్ష్మి నిత్య జీవితంలోనే కాదు రచనా జీవితంలోనూ ఆధునికురాలు. ఛాందసాలు లేని జీవనం గడపాలని, భార్యాభర్తలు స్నేహమయ జీవనాన్ని అనుభవించాలని, స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆ రోజుల్లోనే తన కథలలో చెప్పారామె. 1954లో ఆమె తన తొలి కథా సంపుటి ‘విడదీసే రైలుబళ్లు’ వెలువరించారు. ఈ సంపుటిలోని ‘చీలిన దారులు’ అనే కథలో ఒక జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం ప్రారంభిస్తారు. పెళ్లి ప్రేమను చంపేస్తుంది అని ఆ కథలో రాసి అప్పటికి తెలియని సహజీవనాన్ని ప్రతిపాదించారామె. ‘తొణికిన స్వప్నం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ తదితరాలు ఆమె ఇతర కథా సంపుటాలు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని సూచిస్తూ 1970లలో ఆమె రాసిన ‘పార్వతి కృష్ణమూర్తి కథలు’ పాఠకాదరణ పొందాయి. ఇందులో భార్య అరమరికలు లేకుండా భర్తతో తన అభిప్రాయాలను చెబుతుంది. స్నేహాన్ని, చొరవను ప్రదర్శిస్తుంది. భార్యంటే భర్త చెప్పినట్టుగా పడుండాలనే నాటి ధోరణికి ఈ పాత్ర పూర్తి భిన్నం. రామలక్ష్మి రాసిన కథల్లో ‘అదెక్కడ’ విశిష్టమైనది. ఆ కథలో ముఖ్యపాత్ర తన పేరు మర్చిపోతుంది. దాని కారణం భర్త, పిల్లలు అందరూ ‘అది’ అని పిలుస్తూ ఉండటమే. చివరకు ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. భర్త ‘అదెక్కడ’ అని ఎందరిని అడిగినా కనిపించదు. పురుషుడు మోసం చేస్తే స్త్రీ సింగిల్ మదర్‌గా జీవించగలదనే సందేశం ఇస్తూ కథలు రాశారు. బేలగా ఉండే స్త్రీలను అలాంటి పాత్రలను రామలక్ష్మి హర్షించలేదు. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని కోరుతారు. ఆమె రచనలను ఈ తరానికి మళ్లీ చేరువ చేయాల్సి ఉంది. -
శిరీషది ముమ్మాటికీ హత్యే
- కుటుంబసభ్యుల ఆరోపణ - ఆమె శరీరంపై ఉన్న గాయాలే ఇందుకు సాక్ష్యం ఆచంట: బ్యూటీషియన్ ఆరుమల్లి విజయలక్ష్మి (శిరీష) మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఆత్మహ త్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో ఉంటు న్న ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం మీడి యా ముందుకు వచ్చారు. శిరీష తల్లి రామ లక్ష్మి మాట్లాడుతూ.. తన కుమార్తె మృతి కేసును పోలీసులు నీరు గారుస్తున్నారన్నారు. ‘నా కూతురు ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదు..’ అని రామలక్ష్మి అన్నారు. తేజస్వినిని ఎందుకు విచారించలేదు? స్టూడియో యజమాని రాజీవ్‌ను వివాహం చేసుకోవాల్సిన తేజస్వినిని ఇప్పటివరకు ఎం దుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నిం చారు. ప్లాస్టిక్ తాడును మెడకు బిగించినట్టు శిరీష మృతదేహంపై గుర్తులున్నాయన్నారు. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసు కుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదని ప్రశ్నించారు. రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకా రమే శిరీషను స్టూడియోకు తీసుకెళ్లి మెడకు వైరు బిగించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు. కట్టు కథలు చెబుతున్నారు రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకారం శిరీషను చంపేశారు. ఆమె తలపై, చెంపలు, పెదవులమీ దున్న గాయాలే ఇందుకు సాక్ష్యం. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్క దారి పట్టిస్తున్నారు. వారి మాటలన్నీ కట్టుక థల్లా ఉన్నాయి. – శిరీష అత్త శారద, మామ వెంకటేశ్వర రావు -
రైలు ఢీకొని మహిళ మృతి
బేతంచర్ల: పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. దుర్గంపేటకు చెందిన రామలక్ష్మి(45) రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతున్న సమయంలో డోన్ నుంచి విజయవాడ వెళ్లే గరిబ్‌రథ్ రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైనాన్షియర్ దౌర్జనం: మహిళకు గాయాలు
విశాఖపట్నం : తీసుకున్న బాకీ చెల్లించలేదని... మహిళను ఫైనాన్షియార్ చితకబాదాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై... ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... స్థానిక ఫైనాన్షియర్ సీతారాం వద్ద రామలక్ష్మీ అనే మహిళ గతంలో రూ. 30 వేలు తీసుకుంది. తీసుకున్న నగదు చెల్లించాలని ఆమెపై గత కొద్దికాలంగా ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ క్రమంలో బుధవారం ఉదయం ఆమెను నగదు చెల్లించాలని కోరాడు. అమె మరికొద్ది కాలం గడువు కావాలని కోరింది. దీంతో ఆగ్రహించిన సీతారాం... రామలక్ష్మిపై దాడి చేసి... చితకబాదాడు. స్థానికులు వెంటనే స్పందించి... ఆమెను ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... రామలక్ష్మి ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2,500 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం
ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి జిన్నారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2,500 హెక్టార్లలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు. జిన్నారం మండలంలోని గుమ్మడిదల, మంబాపూర్ గ్రామాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లడంతో రామలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువగా టమాటా పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో రైతుసంఘం అధ్యక్షుడు నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విషజ్వరంలో బాలింత మృతి
విషజ్వరంతో ఐదు రోజుల బాలింత మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం విన్నరపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రామలక్ష్మి(22) అనే వివాహిత ఐదు రోజుల క్రితం ప్రసవించింది. యితే విషజ్వరం కారణంగా మంగళవారం ఉదయం మృతిచెందింది. -
5 రెట్ల సంతోషం కాదు.. 100 రెట్ల కష్టం
ఆగ్రపింఛెన్! ‘‘ మీ వేలి ముద్రలు సరిపోవడం లేదు.. మీ పాసు పుస్తకం లిస్ట్‌లో లేదు.. రేపు రండి.. ఇదీ అధికారుల తీరు. పోనీ వాళ్లు చెప్పినట్లే రేపొచ్చినా ఏదో ఒక సాకు చెప్పి మళ్లీ ‘రేపురా’ అంటూ చెప్పడం.. ఇలా రోజుల తరబడి పింఛన్ దారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ‘ఐదు రెట్ల’ సంతోషం ఎలా ఉన్నా పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మాత్రం ‘వంద రెట్ల’ కష్టం మాత్రం పడాల్సి వస్తోంది. చివరికి ఓపిక నశించిన లబ్ధిదారులు రోడ్లెక్కారు. జీవిత చరమాంకంలో ఎంతో కొంత ఊరటగా ఉంటుందనుకున్న పింఛన్‌ను సమయానికి ఇవ్వకుండా సతాయిస్తారా? అంటూ ప్రశ్నించారు. శరీరం సహకరించకపోయినా జాతీయ రహదారుల మీదకొచ్చి మండుటెండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పుడే మేలు.. ఇప్పుడు దారుణంగా ఉందంటూ ఆగ్రహించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పింఛన్ లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. పోస్టాఫీసుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుడిబండలో ఏకంగా ఎంపీడీఓ చాంబర్‌ను ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కంగుతిన్న రామలక్ష్మి యాడికిలోని హాస్పిటల్ కాలనీకి చెందిన రామలక్ష్మి సోమవారం పింఛన్ తీసుకోవడానికి స్థానిక పోస్టాఫీస్ వద్దకు వెళ్లింది. బీపీఎంను కలువగా వేలిముద్రలు తీసుకున్నాక ఒక రసీదును ఇచ్చి ‘నువ్వు ఇంతకుముందే కమలపాడులో పింఛన్ తీసుకున్నావని రసీదులోవచ్చింది. నువ్వు మళ్లీ పింఛన్ తీసుకునేకి ఎందుకొచ్చావ్’ అని ప్రశ్నించడంతో కంగుతినడం రామలక్ష్మి వంతైంది. అంతలో తేరుకుని ‘నేనెప్పుడు పింఛన్ తీసుకున్నాను..అయినా నాది యాడికయితే కమలపాడులో ఎట్లా తీసుకుంటాను’ అని ప్రశ్నించింది. దీంతో ‘అవన్నీ మాకు సంబంధం లేదు. నువ్వు పింఛన్ తీసుకున్నట్లే! మేమేం చేయలేం’ అనడంతో ఆమె కంటతడి పెట్టుకుంటూ ఎంపీడీఓ కార్యాలయం, పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన ఇంటికి వెళ్లిపోయింది. కొనకొండ్ల(వజ్రకరూరు) : కొనకొండ్ల గ్రామంలోని పోస్టాఫీసు వద్దకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు డిసెంబర్ పింఛన్ల కోసం సోమవారం ఉదయూన్నే వెళ్లారు. సాంకేతిక కారణాల వల్ల గ్రామ కార్యదర్శి పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా ప్రారంభించకపోవడంతో ఉదయన్నే వచ్చిన వారు విసిగిపోయూరు. వెంటనే పింఛన్లు ఇవ్వాలని అధికారులతో తీవ్రస్థారుులో వాగ్వివాదానికి దిగారు. అనంతరం పంచాయతీ కార్యాలయ సమీపంలోని ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. లబ్ధిదారుల ఆందోళనకు సర్పంచ్ మారుతి, ఉపసర్పంచ్ గురుప్రసాద్, ఎంపీటీసీ మునయ్య, మాజీ ఉప సర్పంచ్ రామక్రిష్ణ, వైఎస్సార్సీపీ మండల నేతలు లాలెప్ప, కోటిరెడ్డి, రంగస్వామి, హనుమంతు, శాలివాహన సంఘం నేతలు అంజి, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు రమేష్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయూంలో ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్లు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు అధ్వానంగా తయూరైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయూరుు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఏఎస్ఐ కుళ్లాయిస్వామి, పోలీసులు అక్కడకు చేరుకుని నేతలతో మాట్లాడారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని వృద్ధులు స్పష్టం చేశారు. దీంతో అనంతరం సర్పంచ్ మారుతి, టీడీపీ నేత మోహన్రావ్, ఈవోఆర్డీ మద్దిలేటిస్వామి అక్కడకు చేరుకుని పింఛన్లు అందరికీ వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
31 వరకు ఐజీపీ విద్యుదీకరణ పూర్తిచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరా జలప్రభ పథకం(ఐజీపీ) కింద బోర్లకు విద్యుదీకరణ ప్రక్రియ ను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశంలో ఇంది రా జలప్రభ పథకంపై డ్వామా, విద్యుత్, ఏపీఎంఐపీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా జలప్రభ పథకం కింద చేపట్టిన 20 వేల ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తెచ్చేందుకు సమన్వయంలో పనిచేయాలన్నారు. వీటికి ఓఆర్సీచెల్లింపులను డ్వామా అధికారులు చెల్లించాలన్నారు. డ్రిప్ పరికరాలను 15 రోజుల్లోగా అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మీని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ ఎ.శరత్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాములు, డ్వామా ఏపీడీలు, విద్యుత్‌శాఖ డీఈలు పాల్గొన్నారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు.