ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి
జిన్నారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2,500 హెక్టార్లలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు. జిన్నారం మండలంలోని గుమ్మడిదల, మంబాపూర్ గ్రామాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లడంతో రామలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువగా టమాటా పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో రైతుసంఘం అధ్యక్షుడు నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2,500 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం
Published Sat, Sep 24 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement