ఆగ్రపింఛెన్!
‘‘ మీ వేలి ముద్రలు సరిపోవడం లేదు.. మీ పాసు పుస్తకం లిస్ట్‌లో లేదు.. రేపు రండి.. ఇదీ అధికారుల తీరు. పోనీ వాళ్లు చెప్పినట్లే రేపొచ్చినా ఏదో ఒక సాకు చెప్పి మళ్లీ ‘రేపురా’ అంటూ చెప్పడం.. ఇలా రోజుల తరబడి పింఛన్ దారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ‘ఐదు రెట్ల’ సంతోషం ఎలా ఉన్నా పింఛన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మాత్రం ‘వంద రెట్ల’ కష్టం మాత్రం పడాల్సి వస్తోంది.
చివరికి ఓపిక నశించిన లబ్ధిదారులు రోడ్లెక్కారు. జీవిత చరమాంకంలో ఎంతో కొంత ఊరటగా ఉంటుందనుకున్న పింఛన్‌ను సమయానికి ఇవ్వకుండా సతాయిస్తారా? అంటూ ప్రశ్నించారు. శరీరం సహకరించకపోయినా జాతీయ రహదారుల మీదకొచ్చి మండుటెండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అప్పుడే మేలు.. ఇప్పుడు దారుణంగా ఉందంటూ ఆగ్రహించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పింఛన్ లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. పోస్టాఫీసుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుడిబండలో ఏకంగా ఎంపీడీఓ చాంబర్‌ను ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కంగుతిన్న రామలక్ష్మి
యాడికిలోని హాస్పిటల్ కాలనీకి చెందిన రామలక్ష్మి సోమవారం పింఛన్ తీసుకోవడానికి స్థానిక పోస్టాఫీస్ వద్దకు వెళ్లింది. బీపీఎంను కలువగా వేలిముద్రలు తీసుకున్నాక ఒక రసీదును ఇచ్చి ‘నువ్వు ఇంతకుముందే కమలపాడులో పింఛన్ తీసుకున్నావని రసీదులోవచ్చింది. నువ్వు మళ్లీ పింఛన్ తీసుకునేకి ఎందుకొచ్చావ్’ అని ప్రశ్నించడంతో కంగుతినడం రామలక్ష్మి వంతైంది.
అంతలో తేరుకుని ‘నేనెప్పుడు పింఛన్ తీసుకున్నాను..అయినా నాది యాడికయితే కమలపాడులో ఎట్లా తీసుకుంటాను’ అని ప్రశ్నించింది. దీంతో ‘అవన్నీ మాకు సంబంధం లేదు. నువ్వు పింఛన్ తీసుకున్నట్లే! మేమేం చేయలేం’ అనడంతో ఆమె కంటతడి పెట్టుకుంటూ ఎంపీడీఓ కార్యాలయం, పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన ఇంటికి వెళ్లిపోయింది.
కొనకొండ్ల(వజ్రకరూరు) : కొనకొండ్ల గ్రామంలోని పోస్టాఫీసు వద్దకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు డిసెంబర్ పింఛన్ల కోసం సోమవారం ఉదయూన్నే వెళ్లారు. సాంకేతిక కారణాల వల్ల గ్రామ కార్యదర్శి పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా ప్రారంభించకపోవడంతో ఉదయన్నే వచ్చిన వారు విసిగిపోయూరు. వెంటనే పింఛన్లు ఇవ్వాలని అధికారులతో తీవ్రస్థారుులో వాగ్వివాదానికి దిగారు.
అనంతరం పంచాయతీ కార్యాలయ సమీపంలోని ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. లబ్ధిదారుల ఆందోళనకు సర్పంచ్ మారుతి, ఉపసర్పంచ్ గురుప్రసాద్, ఎంపీటీసీ మునయ్య, మాజీ ఉప సర్పంచ్ రామక్రిష్ణ, వైఎస్సార్‌సీపీ మండల నేతలు లాలెప్ప, కోటిరెడ్డి, రంగస్వామి, హనుమంతు, శాలివాహన సంఘం నేతలు అంజి, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు రమేష్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయూంలో ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్లు వచ్చేవని తెలిపారు.
ఇప్పుడు అధ్వానంగా తయూరైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయూరుు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఏఎస్‌ఐ కుళ్లాయిస్వామి, పోలీసులు అక్కడకు చేరుకుని నేతలతో మాట్లాడారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని వృద్ధులు స్పష్టం చేశారు. దీంతో అనంతరం సర్పంచ్ మారుతి, టీడీపీ నేత మోహన్‌రావ్, ఈవోఆర్డీ మద్దిలేటిస్వామి అక్కడకు చేరుకుని పింఛన్లు అందరికీ వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
5 రెట్ల సంతోషం కాదు.. 100 రెట్ల కష్టం
Published Tue, Dec 30 2014 3:34 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
Advertisement