పింఛను కష్టాలు యధాతథం
అనంతపురం అర్బన్: పేదలకు పింఛను కష్టాలు తొలగిపోవడం లేదు. ఆధార్ లేదంటూ నిలిపివేస్తున్నారు. దీంతో వారు లబోదిబోమంటూ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వేలిముద్రలు సరిపోలని లేదా ఆధార్ అనుసంధానం కాని అర్హులైన వారికి వీఆర్‌ఓ ద్వారా ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలిస్తూనే ఉన్నారు. అయినా అధికారుల్లో మార్పు రావడం లేదు. ఆధార్ లేదనో... వేలిముద్రలు సరిపోలడం లేదనో పింఛను ఇవ్వకుండా నెలలుగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. అధికారుల తీరును కలెక్టర్ తీవ్రంగా పరిగణించి అర్హులై ఉండి సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటే తప్ప న్యాయం జరిగే సూచనలు కనిపించడం లేదు.
రెండేళ్ల నుంచి ..
ఈమె పేరు సాకే ఎర్రమ్మ. ఈమెది బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి. ఆమె తన గోడును చెప్పుకుంది. గతంలో రూ.200 పింఛను ఇచ్చేవారు. రెండేళ్లగా పింఛను నిలిపివేశార ని చె ప్పింది. మండలంలో తహశీల్దారు కార్యాలయానికి తిరిగి వేసారిపోయానని చెప్పింది.
వేలిముద్రలు ఎలా వేయాలి ఈమె పేరు హరిజన లక్ష్మమ్మ. కుష్టువ్యాధిగ్రస్తురాలు. ఈమెది సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి. ఐదు నెలలుగా పింఛను ఇవ్వకపోవడంతో కలెక్టరేట్‌కి వచ్చిన ఈమె తన బాధ చెప్పుకుంది. వేలిముద్రలు పడకపోతే పింఛను రాదంట. నాకు వేళ్లు లేవు. వేలిముద్ర ఎలా వేయాలి. ఐదు నెలలుగా తహశీల్దారు ఆఫీసుకు వెళ్లి నా గోడు చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్‌కి చెప్పుకునేందుకు వచ్చింది.
నెంబరు ఇచ్చారు... పింఛను ఇవ్వలేదు
ఈమె పేరు శకుంతలమ్మ, స్థానిక పాతూరు పరిధిలోని బ్రాహ్మణవీధిలో నివాసముంటోంది. తన గోడును ఆమె చెప్పుకుంది. పింఛను నెంబరు ఎన్116288 ఇచ్చారు. అయితే పింఛను రావడం లేదని చెప్పింది. నాకు ఎవరూ లేరు. పింఛను వస్తే కొంత ఆదరువుగా ఉంటుందని, దాని కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌కు కష్టం చెప్పుకుంది.
సేమ్..' షేమ్'
Published Tue, Mar 15 2016 4:23 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
Advertisement
Advertisement