స్మితాసబర్వాల్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందిరా జలప్రభ పథకం(ఐజీపీ) కింద బోర్లకు విద్యుదీకరణ ప్రక్రియ ను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశంలో ఇంది రా జలప్రభ పథకంపై డ్వామా, విద్యుత్, ఏపీఎంఐపీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా జలప్రభ పథకం కింద చేపట్టిన 20 వేల ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తెచ్చేందుకు సమన్వయంలో పనిచేయాలన్నారు. వీటికి ఓఆర్సీచెల్లింపులను డ్వామా అధికారులు చెల్లించాలన్నారు. డ్రిప్ పరికరాలను 15 రోజుల్లోగా అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ రామలక్ష్మీని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ ఎ.శరత్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాములు, డ్వామా ఏపీడీలు, విద్యుత్‌శాఖ డీఈలు పాల్గొన్నారు.