
పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లోనిరసన వ్యక్తం చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శిరీష
మహబూబ్‌నగర్: కొల్లాపూర్‌లో బర్రెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కోడేరులో ప్రచారం ముగించుకుని వెన్నచర్ల గ్రామానికి వెళ్లగా.. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు శిరీష తమ్ముడు భరత్‌కుమార్‌పై దాడికి యత్నించారు. విషయాన్ని గమనించిన శిరీష తన మద్దతుదారులతో కలిసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
తన తమ్ముడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తనకు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్‌ఐ రాజు శిరీషతో మాట్లాడి శాంతింపజేశారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీ విషయంలో జిల్లా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు.
దారుణం..
— ThulasiChandu (@thulasichandu1) November 21, 2023
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నిరుద్యోగి శిరీష అలియాస్ #Barrelakka తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజల చందాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్న శిరీషకు సోషల్ మీడియాతో విస్తృత స్పందన వస్తోంది. గతంలో కేసులు, బెదిరింపులతో… pic.twitter.com/UopywJvMdA
Comments
Please login to add a commentAdd a comment