ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండ మాణిక్యనగర్‌లో నివాసముండే కుర్మయ్య కుమార్తె శిరీష (15) శంషీగూడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంత వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తండ్రి కుర్మయ్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.