
పూర్తిగా అమెరికాలో...
హర్ష, మోహన్, శిరీష్, క్రిస్టిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రెండు రెళ్లు నాలుగే’. ధర్మ దోనేపూడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర కథకు కొన్ని నిజజీవిత సంఘటనలే ఆధారమనీ, పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ దర్శక, నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవరాజన్, కెమెరా: శ్రీకాంత్ బుజమెళ్ల.