
మంగళూరు: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు మత్స సంతోషి (మహిళల 53 కేజీలు), కె.శిరీష (మహిళల 58 కేజీలు), కోరాడ రమణ (పురుషుల 56 కేజీలు), రాగాల వెంకట రాహుల్ (పురుషుల 85 కేజీలు) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
మరోవైపు మహిళల 63 కేజీల విభాగంలో జి.లలిత, పురుషుల 77 కేజీల విభాగంలో ఎం.రామకృష్ణ రజతాలు సాధించారు. మహిళల 69 కేజీల విభాగంలో ఎస్‌కే అలీమా బేగం నాలుగు పతకాలు గెలిచింది. క్లీన్ అండ్ జర్క్, ఇంటర్ స్టేట్ అంశాల్లో రజతాలు, జర్క్, టోటల్‌లలో కాంస్యాలు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment