శిరీష వ్యవహారమే కారణం!
► ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ నివేదిక సిద్ధం
► శిరీష అంశంతో పరువుపోతుందనే ఆందోళనతోనే ఆత్మహత్య
► నేడు డీజీపీకి నివేదిక అందించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహ త్యకు బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమంటూ ఈ కేసులో విచారణాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఏసీపీ వేధించినట్లుగా వచ్చిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాల్లే వని వెల్లడైన ట్లుగా అందులో నిర్ధారించినట్లు సమాచారం. ఈ నెల 14న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డిది హత్య అని కొంద రు, ఉన్నతాధికారుల వేధింపుల తో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుం బీకులు ఆరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ ఈ ఘటనపై అదనపు డీజీపీ గోపీకృష్ణతో విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరిపారు.
వారు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను, ఎస్సై క్వార్టర్స్‌ను పరిశీలించారు. శిరీష ఆత్మహత్య కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్ లను.. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో నని ఆరా తీశారు. అయితే గజ్వేల్ ఏసీపీ కావాలనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని వేధించినట్లుగా వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా ఆధారాల్లేవని విచారణాధికారులు ధ్రువీకరించుకున్నట్టు తెలుస్తోంది.
అయితే మెటర్నిటీ సెలవు విష యంలో, పాత కేసుల క్లోజింగ్ విషయంలో ఏసీపీ వేధించినట్టు ఆధారాలున్నాయని.. చార్జిమెమోల విషయంలో ఆధారాలేమీ లేవని గుర్తించినట్లు సమాచారం. శిరీష వ్యవహారం లో ఆరోపణలు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయం, మానసిక ఒత్తిడి, క్షణికా వేశంలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్టు గా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది.
ఆందోళన చేసినవారిపై కేసులు
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట చేసిన ఆందోళన, దాడులను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్‌శాఖపై ఆరోపణలు చేసిన సిబ్బందితో పాటు మీడియా వాహనాలు, పోలీస్ వాహనాల ధ్వంసానికి యత్నించిన ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఎస్సై ఆత్మహత్య వ్యవహారాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యగా తప్పుడు ప్రచారం చేసేందుకు యత్నించినట్టుగా విచరణాధికారులు నివేదికలో పొందుప రిచినట్టు తెలిసింది. వారిపై కుట్ర కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించను న్నట్లు సమాచారం. ఈ నివేదికను శుక్రవారం డీజీపీకి అందించనున్నట్లు తెలిసింది.