శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం? | is shirisha had raped; police remand dairy to court | Sakshi
Sakshi News home page

శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం?

Published Tue, Jun 20 2017 9:34 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం? - Sakshi

శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం?

- అత్యాచారం జరిగిఉంటుందని పోలీసుల అనుమానం
- రిమాండ్‌ డైరీలో సంచలన అంశాలు


హైదరాబాద్‌:
బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.  

కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు.. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్‌ రిపోర్టులు ఇంకా రావాల్సిఉందని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్‌ డైరీలో కోర్టుకు వివరించారు. శిరీష కేసులో ఏ1 శ్రవణ్‌.. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. అంతకముందు జరిగిన ఫోన్‌ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్‌ మాట్లాడాడని వెల్లడైంది.

‘సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్‌, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేశాడు. అందుకు రాజీవ్‌ ఆసక్తిప్రదర్శించాడు. దీంతో శ్రవణ్‌.. సిగరేట్‌ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిట’ని నిలదీసింది. ‘నేను అలాంటిదాన్ని కాదం’టూ ఎస్సైని వెనక్కి నెట్టేసింది. అయినాసరే ప్రభాకర్‌రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది’ అని రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement