shravan
-
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ శ్రవణ్ ఫైర్
-
విదేశాల్లో ప్రభాకర్‌రావు, శ్రావణ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు మంగళవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతోపాటు పరారీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, శ్రావణ్ రావులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు. పరారీలో ఉన్న ఇద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసు ఆపై ట్యాపింగ్ టర్న్ తీసుకుంది. దీంతో టెలిగ్రాఫ్ యాక్ట్, సైబర్ టెర్రరిజం చట్టాలను జోడించారు. నిందితుడిగా ఉన్న ప్రణీత్‌ను మార్చి 12న, భుజంగరావును తిరుపతన్నలను 23న, రాధాకిషన్‌రావును 28న అరెస్టు చేశారు. చట్ట ప్రకారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో అతడిపై అభియోగపత్రం దాఖలు చేయకుంటే న్యాయస్థానం అతడికి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంగళవారం ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్ïÙట్ దాఖలు చేశారు. ట్యాపింగ్... వసూళ్లు ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సంబం«దీకులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా అక్రమ నిఘా ఉంచినట్లు వివరించారు. అలాగే, బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారని, అలా తెలుసుకున్న విషయాలతో వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. మొత్తమ్మీద నిందితులు 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని, బాధితుల్లో హైకోర్టు న్యాయమూర్తి కాజా శరత్ కూడా ఉన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోపక్క డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు జరిగాయని నిందితుల తరఫు న్యాయవాది, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. -
అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..`
వరంగల్/మహబూబాబాద్: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీ చైతన్య కళాశాల అధ్యక్షుడు బూర సురేందర్ గౌడ్ కీచకుడని తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈమేరకు నిందితుడు సురేందర్గౌడ్తో పాటు అతడికి సహకరించిన మెస్ ఇన్చార్జ్ శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన బూర సురేందర్‌గౌడ్ స్థానికంగా శ్రీ చైతన్య ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నాడు. నాలుగు అంతస్తుల భవనం.. గ్రౌండ్ ఫ్లోర్లో కళాశాల కార్యాలయం, మొదటి ఫ్లోర్లో తరగతులు, రెండు, మూడు ఫ్లోర్లలో హాస్టల్, నాలుగో ఫ్లోర్లో ఇద్దరు భార్యలు రేణుక, సంధ్య, ఇద్దరు పిల్లలతో సురేందర్‌గౌడ్ నివాసముంటున్నాడు. ప్రస్తుతం బాలికల క్యాంపస్‌లో 160 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సురేందర్‌గౌడ్ సస్పెన్షన్ హసన్‌పర్తి: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భీమారానికి చెందిన శ్రీ చైతన్య జూని యర్ కళాశాల చైర్మన్ బూర సురేందర్గౌడ్ను బీజేపీ 55వ డివిజన్ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వంనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బి.ఉమాశంకర్ సోమవారం ప్రకటించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తిస్తూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు వేటు వేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని సూచించారు. అర్ధరాత్రి ఫోన్ చేసి.. ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో హాస్టల్లో ఉన్న ఆ విద్యార్థినికి శ్రవణ్ ఫోన్ చేసి కిందికి రమ్మన్నాడు. భయపడిన ఆ విద్యార్థిని స్నేహితులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చింది. వారిని చూసిన సురేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఆ విద్యార్థినిని దూషించడమే కాకుండా బెదిరింపులకు గురిచేశాడు. అడ్డుగా వచ్చిన మరో విద్యార్థినిపై చేయి చేసుకుని అక్కడి నుంచి సురేందర్, శ్రవణ్ పరారయ్యారు. కళాశాలలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు.. సురేందర్ గౌడ్ వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించే వాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఏసీపీ కిరణ్‌కుమార్ వివరించారు. విద్యార్థినిపై కన్ను.. హాస్టల్లో ఉంటూ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్ను వేసిన సురేందర్‌గౌడ్ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించాడు. ఇందుకు ఫీజు మాఫీ చేస్తానని.. డబ్బులు కూడా ఇస్తానని మభ్యపెట్టాడు. ఇందుకు హాస్టల్లో మెస్చార్జ్గా పని చేస్తున్న చెన్నారావుపేటకు చెందిన శ్రవణ్ సహకారం తీసుకున్నాడు. పలుమార్లు మాటలతో వేధించడమే కాకుండా అసభ్యకరంగా వ్యవహరించినా ఆ విద్యార్థిని లొంగలేదు. విద్యార్థి సంఘాల ఆందోళన.. కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈమేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం వడ్డేపల్లి చర్చి వద్ద సురేందర్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వాస్తవాలు అంగీకరించారని ఏసీపీ చెప్పారు. సమావేశంలో సీఐ అబ్బయ్య, ఎస్సై సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ? -
శ్రావణ్.. నీ కీర్తి శాశ్వతం
నరసన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసన్నపేట మారుతీ నగర్‌కు చెందిన కృష్ణ శ్రావణ్ మరో ఇద్దరికి ప్రాణదానం చేశాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావణ్ ద్విచక్ర వాహనంతో విజయవాడ దుర్గాదేవి దర్శనానికి వెళ్తూ మూడు రోజుల కిందట ప్రమాదానికి గురయ్యాడు. వైద్యం అందించిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియతో సంప్రదింపులు చేసి అవయవ దానానికి అంగీకరింపజేశారు. గుండె, కాలేయం పనిచేయక పోవడంతో విద్యార్థికి చెందిన రెండు కిడ్నీలు శుక్రవారం జీవన్‌దాన్ రాష్ట్ర సమన్వయకర్త రాంబాబు ఆధ్వర్యంలో సేకరించి విశాఖ లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులకు అందచేశారు. శ్రావణ్ పార్థివ దేహానికి స్వగ్రామం నందిగాం మండలం సుభద్రాపురంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణ్ తల్లి దండ్రులు బంగారి రామరాజు, లావణ్య ప్రియలకు పలువురు అభినందించారు. -
రెండేళ్లు.. బాధితులు 6 వేలు
హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్ఫోన్లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు. ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. రెండేళ్లు..6వేల మంది బాధితులు నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు. -
Margadarsi: అక్రమాలు నిజం!
సాక్షి, అమరావతి: ప్రతి ఏటా మార్చి 31న రూపొందించే బ్యాలెన్స్షీట్లో... చెల్లించాల్సిన బకాయిలు, ఇతర అప్పులకు సమానంగా తమ వద్ద వందల కోట్ల రూపాయల చెక్కుల రూపంలో, మరికొన్ని వందల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు. వాటిని తమ ఆస్తులుగా పేర్కొంటున్నారు. మరి ఆ చెక్కుల్ని తదుపరి కాలంలో ఎప్పుడైనా డిపాజిట్ చేయాలి కదా? ఆ నగదును సంస్థ అవసరాల కోసం ఖర్చు చేయాలి కదా? విచిత్రమేంటంటే అందులో పేర్కొన్న చెక్కుల్లో ఒక్క చెక్కు కూడా తరువాతి కాలంలో సంస్థ ఖాతాలోకి వచ్చిన దాఖలాలు ఉండటం లేదు. నగదు పరిస్థితి కూడా అంతే!!. అంటే ఆ చెక్కులు గానీ, ఆ నగదు కానీ వాస్తవంగా కంపెనీ దగ్గర ఉన్నవి కావన్న మాట!!. వాటిని అప్పటికే వేరే సంస్థల ఖాతాల్లోకో, ఇతరత్రా అవసరాలకో మళ్లించేశారు. కానీ... అవన్నీ తమ వద్దే ఉన్నట్లుగా తప్పుడు బ్యాలెన్స్‌షీట్ ద్వారా మభ్య పెడుతున్నారు. తమ సంస్థ తగిన ఆస్తులతో బలంగానే ఉన్నదని ఒకవైపు చిట్లు వేస్తున్న చిట్ దారులను, మరోవైపు నియంత్రణ సంస్థలను నమ్మిస్తున్నారు. ఇదీ.. రామోజీరావు నడిపిస్తున్న ‘మార్గదర్శి’ అసలు కథ. మార్గదర్శి సంస్థను ఆడిట్ చేస్తున్న ఆడిటింగ్ సంస్థల ప్రతినిధి నేరుగా దర్యాప్తు సంస్థ ఎదుట అంగీకరించిన వాస్తవం. ఇదే కాదు. తనిఖీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మార్గదర్శిలో... ఎక్కడ ఏ సోదా జరిపినా నివ్వెరపోయే నిజాలే వెలుగుచూస్తున్నాయి. వాస్తవాలను బయటకు వెల్లడించకపోవటం ద్వారా.. చిట్లు వేస్తున్నవారికి తమ సొమ్ము ఎంత భద్రంగా ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి సృష్టిస్తున్నారు. అంతేకాదు.. డిపాజిట్లు తీసుకోవటాన్ని నిషేధించినా సరే... వాటిని ఇతరత్రా రూపాల్లో తీసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. చట్టాలను పరిహాసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో కంపెనీలో సీఐడీ జరిపిన తనిఖీల్లో వెల్లడైన పలు అక్రమాలు బయటపడ్డాయి. చార్టర్డ్ అకౌంటెంట్‌కు 14 రోజుల రిమాండ్... మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పలు అవకతవకలున్నట్లు మార్గదర్శి చిట్స్‌కు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కో ప్రతినిధి సీఐడీ విచారణలో వెల్లడించారు. దాంతో బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా... చందాదారుల సొమ్మును తరలించటం, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోను, షేర్లలోను అక్రమంగా పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు సేకరించడం చేసినట్లు ఇప్పటికే సీఐడీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బ్రహ్మయ్య అండ్ కో సంస్థ రికార్డులను తనిఖీ చేసి, ఆ సంస్థ సీఏ శ్రావణ్‌ను విచారించారు. ఈ విచారణలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి ఖాతాలు సవ్యంగానే ఉన్నాయని ఏటా ఆడిట్ నివేదిక ఇస్తున్న ఈ సంస్థ... అసలు మార్గదర్శి చిట్స్ బ్యాంకు ఖాతాలు, రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించకుండానే ఈ నివేదిక ఇస్తున్నట్లు సదరు చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించటం గమనార్హం. ఇలాంటి డిపాజిట్లు ప్రమాదకరమే? ► చిట్లు వేసేవారిలో కొందరు చిట్‌ను పాడుకుంటారు కానీ... ఆ డబ్బును తీసుకోవటానికి అవసరమైన ష్యూరిటీలను కంపెనీకి సబ్మిట్ చేయలేరు. మరికొందరైతే రకరకాల కారణాల వల్ల పాడుకున్న మొత్తాన్ని తీసుకోకుండా భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన చిట్ మొత్తానికి సంబంధించి దాన్ని సదరు చిట్‌ఫండ్ సంస్థ వద్దే వదిలిపెడతారు. ఇంకొందరైతే ఓ రెండు మూడు నెలలు ఉంన్నపుడు చిట్‌ను పాడుకుని... ఆ మిగిలిన నెలల ఫ్యూచర్ చిట్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని సంస్థ దగ్గరే వదిలేస్తారు. అయితే ఏ చిట్‌ఫండ్ సంస్థయినా తమ ప్రతి బ్రాంచి కార్యాలయంలోనూ... అక్కడి చిట్టీలకు సంబంధించిన ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా రెండో బ్యాంకు ఖాతాను నిర్వహిస్తుండాలి. ఇలా ఫ్యూచర్ చిట్ల మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఏ ఒక్క బ్రాంచిలోనూ ఇలా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వేరే బ్యాంకు ఖాతా తెరవలేదు. అన్నిచోట్ల నుంచీ ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తోంది. దానికో రశీదు ఇస్తూ 4–5 వడ్డీ చెల్లిస్తోంది. ఇది అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయటమే. చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న ఈ డిపాజిట్లను గనక ఏ ఆర్బీఐనో జప్తు చేస్తే..? చిట్‌దారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. అయినా సరే మార్గదర్శి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లు సక్రమమేననే రీతిలో బ్రహ్మయ్య అండ్ కో సంస్థ నివేదిక ఇవ్వటం విస్మయం కలిగించేదే!!. ► ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల ఖాతాలు, తమ పెట్టుబడలు వివరాలను బహిర్గతం చేయటం లేదు. గోప్యంగా ఉంచుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. అయినా సరే బ్రహ్మయ్య అండ్ కో ఇది పట్టించుకోకుండా అంతా సక్రమంగానే ఉందని ఆడిట్ నివేదిక ఇచ్చేస్తోంది. అక్రమాలు వాస్తవమే: బ్రహ్మయ్య సంస్థ సీఏ శ్రావణ్ సీఐడీ దర్యాప్తు సందర్భంగా బ్రహ్మయ్య అండ్ కో సీఏ కుదరవల్లి శ్రావణ్ కీలక విషయాలు వెల్లడించారు. తాము అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక జారీ చేస్తున్నామని అంగీకరించారు. మార్గదర్శి చిట్స్ ఆదాయ– వ్యయాలు, ఆస్తి– అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పలేకపోయారు. ఒక్కో బ్రాంచి బ్యాంకు ఖాతాల్లో అప్పుడప్పుడు చూపిస్తున్న వందల కోట్ల రూపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తరువాత అవి ఎక్కడికి మాయమయ్యాయి? అనేది ఆయన ఏమాత్రం చెప్పలేకపోయారు. ఆ వివరాలేవీ తనకు తెలియవని ఆయన అంగీకరించారు. -
తోరణాలైనా వాడకముందే కడతేర్చాడు
వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది. పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినీరంగాన్ని కోవిడ్-19 పట్టి పీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ కరోనాతో అత్యంత "క్లిష్టమైన" స్థితిలో చికిత్స పొందుతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్- శ్రావణ్ ) ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్ (66) పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉందని ఆయన కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. ఎస్ఎల్ రహేజా హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న, తన తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మరోవైపు దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని సంజీవ్ తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇతర సంగీత దర్శకులు ఆకాంక్షిస్తున్నారు. శ్రావణ్, త్వరగా కోలుకోవాలంటూ మరో సంగీత దర్శకుడు నదీమ్ సైఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన భాగస్వామి శ్రావణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు,అభిమానులందరినీ వేడుకున్నారు. (కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్) శ్రవణ్ రాథోడ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు కీర్తి భూషణ్ చెప్పారు. ఆయన చికిత్సం నిమిత్తం ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు. (కరోనా రోగులకు డీఆర్డీవో అద్భుత పరికరం) -
కూతురు Vs బాబాయి
-
మారుతీరావు సోదరుడి ఉంగరాలు మాయం
సాక్షి, నల్గొండ : ప్రణయ్ హత్య కేసు రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఇటీవలె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే శ్రవణ్‌కుమార్ నల్గొండ జైల్లో ఉన్నప్పుడు అతని చేతికి ఉన్న డైమండ్ ఉంగరాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. అవి ప్రస్తుతం మాయమవ్వడం కలకలం రేపుతోంది. డైమండ్ ఉంగరాలు మాయమయ్యాయని జైలు అధికారుల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్ యాదవ్‌పై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉండొచ్చని బాధితులు తెలుపుతున్నారు. -
ఎదురీతకు న్యాయం చేస్తాం
‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర’, ఏక్ నిరంజన్’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రావణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎదురీత’. లియోనా లిషోయ్ కథానాయిక. బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో కల్యాణ్ రామ్ విడుదల చేశారు. శ్రావణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ టైటిల్ ఏంటి? అన్నారు. ‘ఎదురీత’ అని చెప్పా. అప్పుడు ఆయన ఆ సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుగారు 1977లో నటించిన ‘ఎదురీత’ గురించి చెప్పారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా.. ‘ఎదురీత’ టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా. ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తర్వాత ఏం జరిగిందనేది కథ? నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళిగారు ‘సై’ సినిమాతో బ్రేక్ ఇచ్చారు. ఆయనలా ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు మా దర్శకుడు. నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు బోగారి లక్ష్మీనారాయణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు ‘ఎదురీత’ టైటిల్ నా గురించే పెట్టారేమో అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే... నా జీవితమంతా ఎదురీతే. నేను నిర్మాత కాకముందు.. సినిమా అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమే అనుకునేవాణ్ణి. నిర్మాత అయ్యాక... టికెట్ రేటు 2000 రూపాయలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. సినిమా తీయడంలో ఉన్న కష్టం అర్థమైంది’’ అని బోగారి లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘లక్ష్మీనారాయణగారికి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా తీశారు’’ అన్నారు బాలమురుగన్. ‘‘ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు లియోనా లిషోయ్. నటీనటులు జియా శర్మ, శాన్వీ మేఘన, భద్రమ్, ఫైట్ మాస్టర్ రామకృష్ణ, కెమెరామేన్ విజయ్ అర్బుదరాజ్, ఎడిటర్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరల్ కొరెల్లి, లైన్ ప్రొడ్యూసర్: ప్రకాష్ మనోహరన్. -
వైవిధ్యమైన కథ
శ్రవణ్, లియోనా ఈశాయ్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీభాగ్యలక్ష్మీ ఎంటర్టై¯ మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘మూడు రకాల టైమ్ పీరియడ్స్‌తో ప్యారలల్‌గా జరిగే స్క్రీన్‌ప్లేతో జరిగే కథ ఇది. తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం అవుతుంది. పదేళ్లకుపైగా తెలుగులో విలన్ పాత్రల్లో నటిస్తున్న శ్రవణ్‌ను హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. జూలై 2నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది’’ అన్నారు బాలమురుగన్. ‘‘రెగ్యులర్ క్యారెక్టర్‌తో కాకుండా కథలో ట్రావెల్ అయ్యే ఒక డిఫరెంట్ రోల్‌తో హీరోగా పరిచయమవటం హ్యాపీ’’ అన్నారు శ్రవణ్. -
రాయలసీమ ప్రేమకథ
రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందుతోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’. రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, ‘దూకుడు’ శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు ప్రధాన పాత్రల్లో కోటేంద్ర దుద్యాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ – ‘‘పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అహోబిలంలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. శాంతాబాయ్ పాటతో ఆకట్టుకున్న హాట్ బాంబ్ రాధికా పాటిల్‌తో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిపాం. మా చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక మరింత గ్లామర్ తీసుకొచ్చారు. ఈ నెలాఖరులో విడుదల చేసే టీజర్‌తో హీరో, హీరోయిన్లను పరిచయం చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘అనుకున్న టైమ్ కంటే త్వరగా పూర్తయింది. ఔట్పుట్ చూశాం. హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత రఫీ. ఈ చిత్రానికి సంగీతం : చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్. బాబు. -
ప్రేమ పందెంలో గెలుపు ఎవరిది?
‘‘చిన్న సినిమాలు చాలావరకు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ షూటింగ్ దశలోనే ఆగిపోతున్నాయి. లక్ష్మీనారాయణగారికిది తొలి సినిమా అయినా షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదల చేస్తుండడం అభినందనీయం. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేంటో సినిమాలోనే చూడాలి. మా యూనిట్ సభ్యుల సహకారం వల్లే అను కున్నట్లు నిర్మించగలిగాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రేమపందెం’ కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు అర్జున్. తెంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి యన్. సాయివెంకట్, సంగీత దర్శకుడు వెంకట్ ఎస్.వి.హెచ్. పాల్గొన్నారు. ఈ సినిమాకి సహకారం: శరత్సాగర్, కో–ప్రొడ్యూసర్: ఓబయ్య సోమిరెడ్డిపల్లె. -
సింగరేణిలో నిధుల దుర్వినియోగం: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ సంఘం నాయకులు సంస్థను దోచుకుతింటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి తమకు సమాచారం ఉందన్నారు. నియామకాలు, ఇతర వ్యవహారాల్లో యాజమాన్యం, టీబీజీకేఎస్, టీఆర్ఎస్ నాయకులు కలసి అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, మైనింగ్ ప్రాంతాల వారీగా 11 చోట్ల రూ.1,490 కోట్ల విలువైన బొగ్గు ఉండాలని, అలాగే 74 లక్షల టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం లెక్కల్లో చూపినా, వాటిని పరిశీలిస్తే అందులో 10 శాతం కూడా లేదని అన్నారు. లెక్కల్లో తేడాలు, రికార్డుల్లో తప్పులపై విచారణ చేయాల్సిందిగా సీవీసీకి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. -
ప్రేమ పందెం
శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమపందెం’. ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్టర్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘గతంలో ఐదేళ్లు జర్నలిస్ట్‌గా పనిచేశా. అర్జున్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయి అవుట్‌పుట్ ఇచ్చాడు మా దర్శకుడు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఆసక్తి కలిగించే కథ ఇది. అటు ఎమోషన్, ఇటు ఎంటర్టైన్మెంట్తో కూడిన సన్నివేశాలున్నాయి. ఈ సినిమాకి కథే హీరో’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఓబయ్య సోమిరెడ్డిపల్లె. -
అర్ధరాత్రి హైడ్రామా...
- కుకునూర్‌పల్లికి శ్రవణ్, రాజీవ్ - స్థానిక పోలీసుల హెచ్చరికలతో వెంటనే తిరుగుముఖం హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీకి తీసుకుని శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో జరిగిన ఘటనలను పునర్విచారించారు(క్రాస్ చెకింగ్). రాజీవ్, శ్రవణ్ శిరీషను హింసించడం వల్ల ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో స్పష్టం కావడంతో వీరిపై అదనంగా మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 16న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారో కస్టడీలోనూ అవే విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడుతుండటం కళ్లారా చూశామని వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానికి లేదన్న సమాధానమే ఇచ్చారు. ప్రియురాలు తేజస్వినిని, వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీషను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసిన విషయం వాస్తవమేనా అని రాజీవ్‌ను ప్రశ్నించగా.. వారిద్దరినీ దూరం చేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. మీడియా కళ్లుగప్పి.. కస్టడీలో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో హైడ్రామా మధ్య కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు మీడియాకు ఉప్పందించి.. అక్కడ పరీక్షల అనంతరం మీడియా కళ్లుగప్పి అడ్డదారిలో కుకునూర్‌పల్లికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకునూర్‌పల్లిలో అక్కడి పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. పది నిమిషాలు అక్కడ ఉంటే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, విషయం బయటకు పొక్కితే ప్రజలు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిం చడంతో బంజారాహిల్స్ పోలీసులు కుకునూర్ పల్లి పోలీస్‌స్టేషన్ బయటి నుంచే తిరుగుముఖం పట్టారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఇదేనా? ఈ స్టేషన్ వెనకాల ఉన్న క్వార్టర్స్‌కు వచ్చారా? ఎక్కడి నుంచి వెళ్లారు? అనే వివరాలను స్టేషన్ బయటే నిందితులను అడిగి నిమిషాల్లోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. తెల్లవారుజామున 5.30 గంటలకు మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. -
శిరీషను హింసించారు
రాజీవ్–శ్రవణ్ అమానుషంగా ప్రవర్తించారని నిర్ధారించిన పోలీసులు హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. కుకు నూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిం చడం, దాడి చేయడం, కొట్టడం తదితర చర్యల కు పాల్పడినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నిందితులపై తొలుత నమోదు చేసిన ఐపీసీ 306, 109 సెక్షన్లకు తోడు 324, 354, 509 సెక్షన్లను అదనంగా చేర్చారు. రాజీవ్–శ్రవణ్ కస్టడీ గడువు మంగళవారంతో ముగిసింది. నిందితులిద్దరినీ బుధవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచాలని అధికారులు నిర్ణయించారు. వచ్చేప్పుడు ఏం జరిగింది..? మంగళవారం నిందితుల రెండోరోజు విచార ణలో కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో జరిగిన ఘటనలపైనే దృష్టి సారించారు. మార్గమధ్యంలో శిరీష కారు నుంచి ఎందుకు దూకాలనుకుంది..? ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అన్న అంశాలపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. శిరీషపై కుకునూర్‌పల్లిలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన, తిరిగి వచ్చే సమయంలో శ్రవణ్, రాజీవ్ ఆమెను అవమానిస్తూ కొట్టడం, ఇక రాజీవ్ తనను వదిలిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు శిరీష తెలుసు కోవడం తదితర పరిణామాల నేపథ్యంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. కుకునూర్‌పల్లి ఎస్సై క్వార్టర్స్‌లో శిరీషపై అత్యాచారయత్నం జరిగినప్పుడు శ్రవణ్, రాజీవ్ అక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్లారా? అనేది లోతుగా ఆరా తీశారు. నిందితులు తాము ఆ సమయంలో క్వార్టర్స్ బయటే ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. ఆర్జే ఫొటోగ్రఫి స్టూడియోలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలు, సమయం కరెక్టుగా ఉందో లేదో అన్నది క్రైమ్ సీన్ రీ–కనస్ట్రక్షన్ ద్వారా నిర్థారించాలని నిర్ణయించారు. తేజస్విని వాంగ్మూలం నమోదు శిరీషను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం గచ్చిబౌలిలోని తేజస్విని నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసు విచార ణలో తేజస్విని ఈ ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య తనను చాలా కల చి వేసిందని, ఆమె తన కుటుంబం విషయం ఆలోచించి.. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య విషయం 13న తెలిసిందని, ఆ సమయంలో తాను విజయవాడలో ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య చేసు కుందని తెలియగానే కన్నీరుమున్నీరయ్యానని.. సాటి మహిళగా చాలా బాధపడ్డానని పోలీసులకు తెలిపింది. తాను రాజీవ్‌ను ప్రేమించిన విషయం వాస్తవమేనని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని అయితే రాజీవ్–శిరీష సన్నిహితంగా ఉండటం తనకు నచ్చలేదని వాపోయినట్లు తెలుస్తోంది. తమ ప్రేమకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో పలుమార్లు శిరీషడ ను తమ మధ్య నుంచి తప్పుకోవాలని చెప్పిన మాట వాస్తవమేనని.. తన స్థానంలో ఎవరు న్నా అలాగే చేస్తారని విచారణలో తేజస్వి ని పేర్కొన్నారు. 12న తాను విజయవాడ వెళ్లి రాజీవ్ తల్లిని కలిశానని, అయితే పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదని, రాజీవ్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పానని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి తాను తన ఇంటికి వచ్చేశానని, తెల్లవారిన తర్వాత శిరీష ఆత్మహత్య విషయం తెలుసుకున్నానని చెప్పిన ట్లు తెలుస్తోంది. తనకు రాజీవ్ ఫేస్బుక్లో పరిచయం కాగా.. కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారి తీసిందని.. అతడు తనను పెళ్లి చేసుకుం టానని చెప్పడంతో నమ్మానని వెల్లడించినట్లు సమాచారం. గత నెల 30న అనివార్య కారణాల నేపథ్యంలో రాజీవ్, శిరీషపై ఫిర్యాదు చేయడానికి తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తేజస్విని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నాం.. శిరీష వ్యవహారంపై పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఆమె వస్త్రాలతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపాం. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలం. కుకునూర్‌పల్లిలో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. -
పోలీసుల కస్టడీకి రాజీవ్, శ్రావణ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. రాజీవ్, శ్రావణ్లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. -
4రోజుల కస్టడీకి శ్రవణ్, రాజీవ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. -
పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రవణ్
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26,27 తేదీల్లో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. కాగా శిరీష మృతి కేసులో అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1, రాజీవ్‌ను ఏ2గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 13న తేదీ మంగళవారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య అనంతరం జరిగిన ఆందోళనపై సిద్ధిపేట పోలీసులు మూడు వేరు వేరు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. -
శిరీష వ్యవహారమే కారణం!
► ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ నివేదిక సిద్ధం ► శిరీష అంశంతో పరువుపోతుందనే ఆందోళనతోనే ఆత్మహత్య ► నేడు డీజీపీకి నివేదిక అందించే అవకాశం సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహ త్యకు బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమంటూ ఈ కేసులో విచారణాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఏసీపీ వేధించినట్లుగా వచ్చిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాల్లే వని వెల్లడైన ట్లుగా అందులో నిర్ధారించినట్లు సమాచారం. ఈ నెల 14న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డిది హత్య అని కొంద రు, ఉన్నతాధికారుల వేధింపుల తో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుం బీకులు ఆరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ ఈ ఘటనపై అదనపు డీజీపీ గోపీకృష్ణతో విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరిపారు. వారు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను, ఎస్సై క్వార్టర్స్‌ను పరిశీలించారు. శిరీష ఆత్మహత్య కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్ లను.. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో నని ఆరా తీశారు. అయితే గజ్వేల్ ఏసీపీ కావాలనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని వేధించినట్లుగా వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా ఆధారాల్లేవని విచారణాధికారులు ధ్రువీకరించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మెటర్నిటీ సెలవు విష యంలో, పాత కేసుల క్లోజింగ్ విషయంలో ఏసీపీ వేధించినట్టు ఆధారాలున్నాయని.. చార్జిమెమోల విషయంలో ఆధారాలేమీ లేవని గుర్తించినట్లు సమాచారం. శిరీష వ్యవహారం లో ఆరోపణలు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయం, మానసిక ఒత్తిడి, క్షణికా వేశంలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్టు గా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆందోళన చేసినవారిపై కేసులు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట చేసిన ఆందోళన, దాడులను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్‌శాఖపై ఆరోపణలు చేసిన సిబ్బందితో పాటు మీడియా వాహనాలు, పోలీస్ వాహనాల ధ్వంసానికి యత్నించిన ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్సై ఆత్మహత్య వ్యవహారాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యగా తప్పుడు ప్రచారం చేసేందుకు యత్నించినట్టుగా విచరణాధికారులు నివేదికలో పొందుప రిచినట్టు తెలిసింది. వారిపై కుట్ర కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించను న్నట్లు సమాచారం. ఈ నివేదికను శుక్రవారం డీజీపీకి అందించనున్నట్లు తెలిసింది. -
శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం?
- అత్యాచారం జరిగిఉంటుందని పోలీసుల అనుమానం - రిమాండ్ డైరీలో సంచలన అంశాలు హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు.. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టులు ఇంకా రావాల్సిఉందని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. శిరీష కేసులో ఏ1 శ్రవణ్.. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అంతకముందు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్ మాట్లాడాడని వెల్లడైంది. ‘సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేశాడు. అందుకు రాజీవ్ ఆసక్తిప్రదర్శించాడు. దీంతో శ్రవణ్.. సిగరేట్ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిట’ని నిలదీసింది. ‘నేను అలాంటిదాన్ని కాదం’టూ ఎస్సైని వెనక్కి నెట్టేసింది. అయినాసరే ప్రభాకర్‌రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది’ అని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. శిరీష విషయంలో తప్పంతా రాజీవ్‌దే: ఏ1 శ్రవణ్ -
శిరీష విషయంలో తప్పంతా రాజీవ్‌దే: ఏ1 శ్రవణ్
హైదరాబాద్: సంచలనం రేపిన మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధమ నిందితుడు(ఏ1) శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శిరీష మరణంలో తన ప్రమేయమేదీ లేదని, జరిగిన విషయాలన్నింటికీ కారణం రాజీవేనని అన్నాడు. శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన సమయంలో శ్రవణ్ తన గోడును మీడియా ముందు వెళ్లగక్కాడు. రాజీవ్‌ను కాకుండా, శ్రవణ్‌ను ఏ1గా చేర్చడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లైంది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన శ్రవణ్ ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు సంబంధిత ఫొటోలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఎస్సై పరీక్షలకు కోచింగ్ పేరుతో హైదరాబాద్‌లో ఉంటుండగా శిరీష, రాజీవ్‌లు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఎస్సై ప్రభాకర్ రెడ్డితో నల్లగొండలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. శిరీష కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న శ్రావణ్, రాజీవ్‌లకు శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. (ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి..) -
శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు
కుకునూర్‌పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని! గజ్వేల్/కొండపాక: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. -
ప్రదీప్ అనుమానాస్పద మృతి
-
ప్రదీప్ అనుమానాస్పద మృతి
- ఫ్యాన్‌కు ఉరేసుకొని బుల్లితెర హీరో ఆత్మహత్య! - ఇంట్లో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి శ్రవణ్ - రాత్రి వరకు బర్త్‌డే పార్టీ - వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌పై భార్య పావనితో గొడవ - బయటకెళ్లి గంట తర్వాత రాక.. మళ్లీ వాగ్వాదం - బెడ్రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్న ప్రదీప్ - గదిలో పగిలిన అద్దాలు, రక్తపు మరకలు - సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో నటిస్తున్న ప్రదీప్ - కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: బుల్లితెర హీరో ప్రదీప్ కుమార్ (29) బుధవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన భార్య దుర్గారెడ్డి అలియాస్ పావనిరెడ్డి చెబుతున్నారు. అయితే వారింట్లో శ్రవణ్ అనే మరో వ్యక్తి ఉండటం, డైనింగ్ టేబుల్‌పై మద్యం సీసా, ఆ సమీపంలో పగిలిన అద్దాలు ఉండటంతోపాటు ప్రదీప్ నుదుటిపై గాయం కావడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సప్తమాత్రిక, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్స్‌లో ప్రదీప్ నటిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ.. సహజీవనం.. పెళ్లి.. హైదరాబాద్ నగర శివార్లలోని నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ గ్రీన్ ఐకానిక్ అపార్ట్మెంట్లో భార్య పావనిరెడ్డితో ప్రదీప్ నివసిస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన.. తన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడే విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ పట్టా పొందారు. ప్రదీప్‌కు చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనూ కొన్ని డ్రామాల్లో నటించారు. 2006లో విడుదలైన చుక్కల్లో చంద్రుడు సినిమాలో చిన్న పాత్ర పోషించారు. అదే సినిమాలో నటించిన పావని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారినప్పటికీ జీవితాల్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి ఇరువురూ సహజీవనం చేశారు. 2016 ఆగస్టు 21న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రదీప్ ప్రస్తుతం తమిళ సీరియల్లోనూ నటిస్తున్నారు. అగ్నిపూలు, కుటుంబ గౌరవం సీరియళ్లలో హీరోయిన్గా నటించిన పావని ప్రస్తుతం.. నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్లో ప్రదీప్‌తో కలసి హీరోయిన్గా నటిస్తున్నారు. ఎవరీ శ్రవణ్? విశాఖపట్నానికి చెందిన డి.శ్రవణ్ ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పావనిరెడ్డికి స్నేహితుడైన ఇతడు తరచుగా నెక్నాంపూర్‌లోని వీరి ఇంటికి వస్తుండేవాడు. గతంలో కేవలం సెలవులు ఇచ్చినప్పుడు ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లేవాడు. ఈసారి మాత్రం మూడు నెలల క్రితం ప్రదీప్ ఇంటికి వచ్చిన శ్రవణ్ ఇక్కడే ఉండిపోయాడు. మంగళవారం శ్రవణ్ పుట్టినరోజు కావడంతో పావనిరెడ్డి, బంధువులు శ్రవణ్‌కుమార్ స్నేహితులు అదే ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సీరియల్ షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన ప్రదీప్ సైతం ఈ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అతిథులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రదీప్, పావని, శ్రవణ్ మాత్రమే ఇంట్లో మిగిలారు. ఘర్షణ ఎవరి మధ్య జరిగింది? పావనిరెడ్డి తన వాట్సాప్ డీపీగా శ్రవణ్‌తో కలిసి ఉన్న ఫొటో పెట్టినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రదీప్ ఈ విషయంపై పావనిని నిలదీశాడని సమాచారం. దీంతో వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ సైతం కలగజేసుకున్నాడని, అతడికీ ప్రదీప్‌కు ఘర్షణ జరిగినట్లు అనుమానాలున్నాయి. ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన ప్రదీప్ గంటన్నర తర్వాత వచ్చాడని, మళ్లీ వాగ్వాదానికి ఉపక్రమించాడని పావని చెబుతున్నారు. తాను బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకో వడంతో ప్రదీప్ తీవ్రస్థాయిలో మందలిం చాడని, దీంతో బయటకు వచ్చానని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత ప్రదీప్ బెడ్రూమ్ లోకెళ్లి గడియ పెట్టుకున్నాడని తన వాంగ్మూ లంలో పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బెడ్రూమ్ తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో శ్రవణ్‌తో కలిసి బలవంతగా తలుపు తెరిచానని చెబుతు న్నారు. ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడని, 108కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి చనిపోయాడని ధ్రువీకరించారని చెప్పారు. విధ్వంసం, గాయాలకు కారణం? ఘటనాస్థలి, అక్కడున్న పగిలిపోయిన వస్తువులు, రక్తం మరకలు, ప్రదీప్ ఒంటిపై ఉన్న గాయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాట్సాప్ డీపీ విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రదీప్–పావని–శ్రవణ్ మధ్య ఏం జరిగిందనేది కీలకంగా మారింది. డైనింగ్ టేబుల్‌పై మద్యం సీసా ఉండటాన్ని బట్టి అక్కడే ప్రదీప్, శ్రవణ్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దానికి సమీపంలో ఉన్న అద్దం, ఇతర వస్తువులు పగిలిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి రక్తం మరకలు బెడ్రూమ్ వరకు ఉన్నాయి. దీనికి తోడు మృతుడి తలపై ఉన్న గాయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రదీప్ కోపంతో బెడ్రూంలోకి వెళ్లాడనుకున్నా.. వెంట భార్య పావని ఎందుకు వెళ్లలేదన్నది అంతు చిక్కట్లేదు. ఉరి వేసుకున్న ప్రదీప్‌ను తాను, శ్రవణ్ కిందికి దింపామని, ఆ ప్రయత్నాల్లోనే కింద పడటంతో అతడి తలకు గాయమైందని పావని చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీంతో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. పావని వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని నార్సింగ్ ఇన్స్పెక్టర్ రామ్‌చంద్రరావు చెప్పారు. మాకు ఎలాంటి అనుమానం లేదు: మృతుడి తల్లిదండ్రులు మా కుమారుడు ప్రదీప్ కుమార్ మరణంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. పావనిరెడ్డి మమ్మల్ని బాగానే చూసుకునేది. చిన్నపాటి గొడవకే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదు. శ్రవణ్ నాకు అన్న అవుతాడు: పావనిరెడ్డి శ్రవణ్‌తో కలిసి ఉన్న ప్రొఫైల్ పిక్ వల్లే గొడవ జరిగిందనేది అవాస్తవం. అతను నాకు అన్నయ్య అవుతాడు. మావారితో కలసి మెలసి ఉంటాడు. అలాగే ప్రదీప్ కుటుంబ సభ్యులతోనూ నాకు ఎలాంటి విభేదాలు లేవు. బుధవారం తెల్లవారుజామున మా మధ్య పెద్దగా గొడవ ఏమీ జరగలేదు. ఇంతకుమించి ఈ సమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేను. గతంలో గొడవలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. ఇలా చేస్తాడని ఊహించలేదు. బావ అంటూ సరదాగా ఉండేవాడు: శ్రవణ్‌రెడ్డి పావనిరెడ్డి నాకు సోదరి అవుతుంది. నేను ఖతార్‌లో ఉద్యోగం చేస్తుంటా. ప్రతి ఏడాది సెలవుల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ నాలుగు ఐదు రోజులు ఉండి వెళుతుంటా. ఈసారి వీసా సమస్య వల్ల ఇక్కడే ఉండిపోయా. ఈ సమయంలో న్యూట్రిషన్ ప్రోగామ్ చేద్దామని ప్లాన్ చేశా. ప్రదీప్ భాగస్వామి అవుతా అన్నాడు. బుధవారం రాత్రి బర్త్‌డే జరిగాక 12.30 గంటలకు సిగరెట్ కాల్చి వస్తాను బావా అంటూ వెళ్లి గంటసేపటి తర్వాత వచ్చాడు. ఇంతసేపు ఎటు వెళ్లావని, ఆందోళనకు గురయ్యానని పావని అడిగింది. ఈ చిన్నపాటి గొడవ తర్వాత ప్రదీప్ బెడ్రూమ్కు వెళ్లడం, ఉదయం ఉరివేసుకొని కనిపించడం జరిగింది. అన్యోన్యంగా ఉండేవాళ్లు ప్రతి ఫ్రెండ్‌కు సంబంధించిన బర్త్‌డే పార్టీలు, ఫంక్షన్లు ఏమి ఉన్నా ఇద్దరూ అన్యోన్యంగా వచ్చి ఎంజాయ్ చేసేవాళ్లు. వాళ్ల వాళ్ల బర్త్‌డేలను సర్ప్రైజ్గా ప్లాన్ చేసి బాగా చేసుకునేవారు. ఏ ఫంక్షన్ అయినా హాజరయ్యేవారు. రెడ్ ఎఫ్ఎం రెడ్ కార్పెట్ ప్రోగ్రామ్‌లో బాహుబలి–2 రెండు టికెట్లు తీసుకొని సినిమాకు కూడా వెళ్లారు. అన్యోన్యంగా ఉండటంతో పాటు ఒక రిని ఒకరు బాగా చూసుకునేవారు. – చైతూ, రేడియో జాకీ -
ప్రదీప్ మృతి: శ్రావణ్ ఎవరు?
-
ప్రదీప్ మృతి: శ్రావణ్ ఎవరు?
హైదరాబాద్: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్ మృతి నేపథ్యంలో శ్రావణ్ అనే వ్యక్తిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు నెలలుగా ప్రదీప్ ఇంట్లోనే శ్రావణ్ ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ భార్య పావనీరెడ్డి తనతో శ్రావణ్ చనువుగా ఉన్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు చెప్తున్నారు. ప్రదీప్ కుటుంబసభ్యులు పావనీరెడ్డి తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్య అయితే ఇంట్లో అద్దాలు ఎందుకు పగిలిపోయాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రదీప్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణ్ ఎట్టకేలకు స్పందించాడు. గత రాత్రి తన పుట్టినరోజు కావడంతో తాము పార్టీ చేసుకున్నామని, పార్టీ మధ్యలోనే ప్రదీప్ బయటకు వెళ్లివచ్చాడని చెప్పాడు. గంటన్నర తర్వాత ప్రదీప్ తిరిగి ఇంటికి వచ్చాడని, తెల్లారిసరికి అతను గదిలో ఆత్మహత్య చేసుకొని కనిపించాడని చెప్పారు. పావనితో తనకున్నది అన్నాచెల్లెళ్ల అనుబంధమని, తనపై విమర్శలు రావడం బాధ కలిగిస్తున్నదని తెలిపాడు. మరోవైపు ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అతని మృతదేహాన్ని పుప్పాలగూడలోని ఇంటికి తరలించారు. -
అధికారమదంతోనే ఆ మాటలు
కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు శ్రవణ్, దయాకర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ద్రోహులైన తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్రావు వంటివారిని సిగ్గులేకుండా మంత్రులను చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధికారమదంతో మాట్లాడుతున్నారని టీపీ సీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో, మోసం తో వచ్చిన అధికారం శాశ్వతంగా ఉండ దన్నారు. మంత్రి కేటీఆర్ స్థారుుకి మించి మాట్లాడటం తగదన్నారు. కోదండరాంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవా లని, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాంకు క్షమాపణలు చెప్పాలని శ్రవణ్, దయాకర్ సూచించారు. కోదండరాం అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన వెనుక తెలంగాణ సమాజం ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహం కారంతో మాట్లాడటం మానుకోకుంటే ప్రజలు మంత్రి కేటీఆర్‌కు తగిన విధంగా బుద్ధిచెప్తారని హెచ్చరించారు. విమలక్క కార్యాలయం సీజ్ సరికాదు.. అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క విషయంలో పోలీసుల తీరు సరికాదని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నేతలు దాసో జు శ్రవణ్, కత్తి వెంకటస్వామి, ఇందిరా శోభ న్, కైలాష్‌నేత హెచ్చరించారు. గాంధీభవన్ లో వారు శనివారం విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన విమలక్కపై పోలీసుల దాడి, చేయడం, కార్యాలయాన్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. వికలాంగుల విభాగ చైర్మన్‌గా వీరయ్య టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌గా ముత్తినేని వీరయ్యను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వీరయ్య తెలిపారు. -
శ్రావణ కిరణం
21 ఏళ్లకే సీఏ పట్టా అందుకున్న విద్యార్థి పరకాల : ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి పూర్తికాగానే ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసించేందుకు వెళ్తుంటారు. మరికొందరు మెడిసిన్, ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఆరాటపడుతుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సులను చదవకుండా భిన్నంగా, ఎంతో కష్టతరంగా ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ను అభ్యసించేందుకు ఆసక్తి చూపాడు. ఈ మేరకు తాను ఎంచుకున్న కోర్సును చిరుప్రాయంలోనే విజయవం తంగా పూర్తి చేసి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన గంజి పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వెంకట్‌రెడ్డి ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం పరకాలకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన నగర పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఫస్ట్.. వెంకటరెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు శ్రావణŠ కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. 1995 ఆగస్టు 7వ తేదీన జన్మించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 1 నుంచి 8వ తరగతి వరకు పరకాలలోనే చదివాడు. 8 నుంచి 10వ తరగతి వరంగల్ ఎస్పీఆర్లో పూర్తి చేశాడు. కాగా, 2010లో పదో తరగతి ఫలితాల్లో ఆయన 600 మార్కులకు 538 సాధించి ప్రతిభ కనబరిచాడు. 2012లో ఎంఈసీ గ్రూపులో 1000కి 937 మార్కులు సాధించాడు. అనం తరం సీపీటీలో ప్రవేశ పరీక్ష రాయగా 200 మార్కులకు 172 మార్కులను సాధించాడు. అలాగే ఐపీసీసీలో 700 మార్కు లకు 385 మార్కులను సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత రెండేళ్ల పాటు ప్రముఖ ఆడిటర్ తిప్పర్తి రాఘవరెడ్డి దగ్గర అప్రెంటీస్ పూర్తి చేశాడు. మంచి మార్కులతో సీఏ ఉత్తీర్ణత గత మే నెలలో జరిగిన సీఏ ఫైనల్ పరీక్షకు హాజరైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 800 మార్కులకు 479 మార్కులు సాధించాడు. మెుత్తం మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. కాగా, గత ఏడాదిలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సాధించిన 479 మార్కులకు ఆలిండియా ర్యాంకు రాగా.. ఇప్పుడు త్రుటిలో జాతీయ ర్యాంకు కోల్పోయాడు. ఇదిలా ఉండగా, సీఏ గ్రూపు–1, గ్రూపు–2లో మొత్తంగా 8 సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చిన సీఏలో అనర్హుడిగానే పరిగణిస్తారు. కానీ.. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఒకేసారి 8 సబ్జెక్ట్‌లను రాసి మొదటి శ్రేణిలో పాస్ కావడం విశేషం. ఎంతో కష్టమైన సీఏ కోర్సును చిన్న వయస్సులోనే పూర్తి చేసి రికార్డు సాధించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. కష్టమని తెలిసే ఎంచుకున్నా. ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులను అభ్యసించేందుకు ఆరాటపడుతుంటారు. నాకు మొదటి నుంచి గణితం, సైన్స్‌లో 98 శాతం మార్కులు వచ్చేవి. దీంతో ఇంట్లో అందరు నన్ను ఇంజినీరింగ్ చేయాలని ఒత్తిడి చేశారు. నాకు మాత్రం సీఏ చేయాలనే ఉండేది. సమాజంలో సీఏలకు మంచి గౌరవం ఉంటుంది. అందుకనే ఆ కోర్సును పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నా. సీఏ చదివేందుకు అమ్మనాన్న నాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. మా సార్ రాఘవరెడ్డి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహంతో మొదటి ప్రయత్నంలోనే సీఏను సాధించాను. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినందుకే ఫలితం వచ్చింది. –గంజి శ్రావణ్‌కుమార్‌రెడ్డి -
కేటీఆర్ ది అవివేకం, అహంకారం
ధ్వజమెత్తిన మధుయాష్కీ, శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: అవివేకం, అహంకారం, అజ్ఞానంతో రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందంటే టీఆర్ఎస్కు, కేటీఆర్‌కు ఉలుకు, వణుకు ఎందుకని వారు ప్రశ్నించారు. అవినీతి బయట పడుతుందని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేటీఆర్‌కు ఐటీ తప్ప చట్టం తెలిసినట్టులేదని మధు యాష్కీ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్‌పై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు విషయంలో ఎంపీ కవిత డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు. -
అక్రమాలు బయటపడతాయనే...
జీవోల వెబ్సైట్ నిలిపివేతపై శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న అక్రమాలు బయటపడొద్దనే జీవోల వెబ్‌సైట్‌ను నిలిపేశారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. జీవోల వెబ్‌సైట్‌ను నిలిపేయడంపై జీఏడీ, ఐటీ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద మంగళవారం దరఖాస్తు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ టెండర్లు, పరిపాలనా పరమైన విషయాలు, పారిశ్రామిక విధానం, ఇసుక కేటాయింపులు, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు వంటి వాటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. నోటా ఏర్పాటు చేయకపోవడం, ఈవీఎంలలో ట్యాంపరింగ్ వ్యవహారం, ప్రింటర్లు ఏర్పాటు చేయకపోవడం లాంటి వాటిపై అన్ని రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేశామన్నారు. -
సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు
బాలీవుడ్లో అద్భుత చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన సంగీత ద్వయం నదీమ్ - శ్రవణ్‌ల జోడీలోని శ్రవణ్ ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవే పై ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం శ్రవణ్, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1979లో రిలీజ్ అయిన దంగల్ సినిమాతో సంగీత ప్రయాణం మొదలు పెట్టిన నదీమ్ శ్రవణ్‌లు 2005 వరకు కలిసి పనిచేశారు. ఆ తరువాత ఇద్దరు విడి విడిగా సంగీత దర్శకత్వం చేస్తున్నప్పటికీ భారీ విజయాలను మాత్రం నమోదు చేయలేకపోయారు. -
రచ్చ రంబోల
‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ‘రచ్చ రంబోల’ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘రచ్చ రంబోల’ పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందనుంది. కవల సోదరులైన ధర్మక్షేత్ర, ధర్మరక్షలను దర్శకులుగా పరిచయం చేస్తూ, నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబి, నాని కృష్ణ ఈ చిత్రం నిర్మించనున్నారు. సామాజిక సమస్య నేపథ్యం ఉన్న ఈ చిత్రం కథాంశం అన్ని వర్గాలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శకులు పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘డిసెంబరు 6న చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటి షూటింగుతో సినిమాను పూర్తి చేస్తాం. ‘ప్రేమ-ఇష్క్-కాదల్’ చిత్రానికి స్వరాలందించిన శ్రవణ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష
సందర్భం-10న రాఖీ భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షాబంధన విశేషాలను చెబుతూ దీని వల్ల కలిగే మేలును వివరించాడు. శ్రావణ పౌర్ణిమను రక్షాబంధనం పండుగగా పిలుచుకొంటాం. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు కట్టే రక్ష ఇది. ఈ పండుగ ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తర పురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపోతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాం. రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని ఆ తర్వాత మొదలుపెట్టి, అజేయులయ్యేవారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందని విశ్వాసం. శ్రావణ పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశం. ఇప్పుడంటే అక్కాచెల్లెళ్లు మాత్రమే అన్నదమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భర్తకి భార్య రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే ఇందుకు నిదర్శనం. చరిత్ర విషయానికి వస్తే, పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడతాడు అలెగ్జాండర్. విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా బేగం, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదిస్తుంది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న ఆమె, శ్రావణ పౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టి, బహుమానంగా భర్త ప్రాణాలు కాపాడమని కోరుతుంది. తన చేతికి ఉన్న రక్ష కారణంగా అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు. సంప్రదాయం ప్రకారమైతే, పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు తిలకం దిద్ది, అప్పుడు మాత్రమే రక్షను కట్టాలి. ‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల’’ రక్షాబంధనమనేది కేవలం అన్నాచెల్లెళ్లు కట్టుకునేదే కాదు, రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగ. ఈ ఆచారాన్ని తప్పకుండా అందరూ పాటించాలని కూడా చెబుతారు. శ్రావణీ నృపతిం హంతి... గ్రామం దహతి ఫాల్గుణి శ్రావణ మాసంలో రాజులకు, ఫాల్గుణ మాసంలో గ్రామానికీ ప్రమాదమని శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇది రాజవంశాలలో ప్రారంభమై ఉంటుందని తెలుస్తోంది. శ్రావణంలో వచ్చే భద్ర అనబడే సంపుటి ప్రభావంతో రాజవంశాలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా ఈ రక్షాబంధనం వచ్చిందని తెలుస్తోంది. భద్ర సంపుటి ఏర్పడితే, ఆ రోజున ఏ పనులూ చేయరాదు. అయితే ఆ సంపుటి శ్రావణ పౌర్ణమినాడు వచ్చినప్పటికీ అది వర్జ్యంగా పరిగణింపబడదు. అంటే రక్షాబంధనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకం వచ్చినా అంటే వర్జ్యం వచ్చినా కూడా వదలవద్దని శాస్త్రోక్తి. - డా. పురాణపండ వైజయంతి -
సీఎం జైలు పాలు కాక తప్పదు: శ్రావణ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీఆర్ఎస్ నేత శ్రావణ్ మంగళవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. నందగిరి హిల్స్ భూ కుంభకోణం, చిత్తూరు జిల్లా నీటి కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జైలుపాలు కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం కిరణ్ వ్యవహరిస్తున్న తీరుపై టీ.మంత్రుల ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.