
మారుతీరావు(ఫైల్)
సాక్షి, నల్గొండ : ప్రణయ్ హత్య కేసు రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఇటీవలె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే శ్రవణ్‌కుమార్ నల్గొండ జైల్లో ఉన్నప్పుడు అతని చేతికి ఉన్న డైమండ్ ఉంగరాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. అవి ప్రస్తుతం మాయమవ్వడం కలకలం రేపుతోంది. డైమండ్ ఉంగరాలు మాయమయ్యాయని జైలు అధికారుల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్ యాదవ్‌పై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉండొచ్చని బాధితులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment