పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రవణ్
పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రవణ్
Published Sat, Jun 24 2017 8:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26,27 తేదీల్లో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. కాగా శిరీష మృతి కేసులో అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1, రాజీవ్‌ను ఏ2గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ నెల 13న తేదీ మంగళవారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య అనంతరం జరిగిన ఆందోళనపై సిద్ధిపేట పోలీసులు మూడు వేరు వేరు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement