sirisha suicide case
-
అర్ధరాత్రి హైడ్రామా...
- కుకునూర్‌పల్లికి శ్రవణ్, రాజీవ్ - స్థానిక పోలీసుల హెచ్చరికలతో వెంటనే తిరుగుముఖం హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీకి తీసుకుని శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో జరిగిన ఘటనలను పునర్విచారించారు(క్రాస్ చెకింగ్). రాజీవ్, శ్రవణ్ శిరీషను హింసించడం వల్ల ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో స్పష్టం కావడంతో వీరిపై అదనంగా మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 16న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారో కస్టడీలోనూ అవే విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడుతుండటం కళ్లారా చూశామని వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానికి లేదన్న సమాధానమే ఇచ్చారు. ప్రియురాలు తేజస్వినిని, వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీషను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసిన విషయం వాస్తవమేనా అని రాజీవ్‌ను ప్రశ్నించగా.. వారిద్దరినీ దూరం చేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. మీడియా కళ్లుగప్పి.. కస్టడీలో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో హైడ్రామా మధ్య కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు మీడియాకు ఉప్పందించి.. అక్కడ పరీక్షల అనంతరం మీడియా కళ్లుగప్పి అడ్డదారిలో కుకునూర్‌పల్లికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకునూర్‌పల్లిలో అక్కడి పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. పది నిమిషాలు అక్కడ ఉంటే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, విషయం బయటకు పొక్కితే ప్రజలు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిం చడంతో బంజారాహిల్స్ పోలీసులు కుకునూర్ పల్లి పోలీస్‌స్టేషన్ బయటి నుంచే తిరుగుముఖం పట్టారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఇదేనా? ఈ స్టేషన్ వెనకాల ఉన్న క్వార్టర్స్‌కు వచ్చారా? ఎక్కడి నుంచి వెళ్లారు? అనే వివరాలను స్టేషన్ బయటే నిందితులను అడిగి నిమిషాల్లోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. తెల్లవారుజామున 5.30 గంటలకు మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. -
పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రవణ్
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26,27 తేదీల్లో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. కాగా శిరీష మృతి కేసులో అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1, రాజీవ్‌ను ఏ2గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 13న తేదీ మంగళవారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య అనంతరం జరిగిన ఆందోళనపై సిద్ధిపేట పోలీసులు మూడు వేరు వేరు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. -
శిరీష విషయంలో తప్పంతా రాజీవ్‌దే: ఏ1 శ్రవణ్
హైదరాబాద్: సంచలనం రేపిన మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధమ నిందితుడు(ఏ1) శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శిరీష మరణంలో తన ప్రమేయమేదీ లేదని, జరిగిన విషయాలన్నింటికీ కారణం రాజీవేనని అన్నాడు. శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన సమయంలో శ్రవణ్ తన గోడును మీడియా ముందు వెళ్లగక్కాడు. రాజీవ్‌ను కాకుండా, శ్రవణ్‌ను ఏ1గా చేర్చడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లైంది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన శ్రవణ్ ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు సంబంధిత ఫొటోలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఎస్సై పరీక్షలకు కోచింగ్ పేరుతో హైదరాబాద్‌లో ఉంటుండగా శిరీష, రాజీవ్‌లు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఎస్సై ప్రభాకర్ రెడ్డితో నల్లగొండలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. శిరీష కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న శ్రావణ్, రాజీవ్‌లకు శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. (ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి..)