బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీ.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.
సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.