Custudy
-
ఎన్ఐఏ కస్టడీకి పీఎఫ్ఐ సభ్యులు
సాక్షి, చెన్నై: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఐసిస్‌కు అనుకూలంగా, దేశంలో మైనారిటీ పాలనే లక్ష్యంగా పీఎఫ్ఐ సాగిస్తున్న ప్రయత్నాలపై అనుమానంతో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి తమిళనాడుకు చెందిన 10 మంది సహా దేశ వ్యాప్తంగా 106 మందిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా చెన్నై, మదురై, దిండుగల్, తేనిలకు చెందిన అయిదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. -
శివకుమార్ కస్టడీ పొడిగింపు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రె స్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు సందర్భంగా జడ్జి అజయ్ కుమార్ కుహర్ మాట్లాడుతూ తమ మొదటి ప్రాధాన్యం శివకుమార్ ఆరోగ్యమేనని, ఆయనకున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈడీకి సూచించారు. ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలని, అవసరమైతే మధ్యలోకూడా పరీక్షలు చేయించాలని చెప్పారు. రోజులో అరగంట పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించారు. ఈడీ అరెస్ట్ చేసిన వెనువెంటనే కస్టడీకి ఇచ్చే అవకాశం ఏదీ ఉండదని, అయితే తగిన అధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేసేందుకు కస్టడీకి అనుమతి ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఈ నెల 3న అరెస్టయిన శివకుమార్ గత 9 రోజులుగా ఈడీ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే. శివకుమార్ సహకరించట్లేదు.. శివకుమార్‌ను విచారించేందుకు అయిదు రోజుల కస్టడీ కావాలని ఈడీ అంతకుముందు ఢిల్లీ కోర్టును కోరింది. విచారణకు శివకుమార్ సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చారని, కాబట్టి మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఆయన వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ సంపాదన ఉందని, రూ. 800 కోట్ల విలువ చేసే ఆస్తులు బినామీల పేరిట ఉన్నాయని ఈడీ పేర్కొంది. అలాగైతే అయిదు రోజుల కస్టడీలో కూడా ఆయన ఏమీ చెప్పరని కోర్టు అభిప్రాయపడింది. శివకుమార్ నడుపుతున్న ట్రస్టు, ఆస్తులు, కోట్ల రూపాయల వ్యాపారాల వెనుక ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నట్లు ఈడీ అధికారి తెలిపారు. -
శివకుమార్‌కు 13 వరకు కస్టడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన శివకుమార్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఈ ఉత్తర్వులిచ్చారు. బుధవారం రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షల అనంతరం శివకుమార్‌ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. శివకుమార్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభిషేక్‌మను సింఘ్వీ, దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ శివకుమార్ అరెస్టు అన్యాయం అనీ, అతను పరారవుతాడన్న ఈడీ అనుమానాలు నిరాధారమని వాదించారు. శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కర్ణాటక, ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం బయట దహనం చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. ఐదారు బస్సులపై రాళ్ల దాడి జరిగిందని, కనకపుర, బెంగళూరులో బస్సులను తగలబెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. -
చిదంబరం కస్టడీ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. విచారణను నీరుగార్చలేం.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. గురువారం పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చారు. చిదంబరమే ప్రధాన నిందితుడనీ ప్రాథమికంగా తెలుస్తున్నందున, న్యాయపరమైన అడ్డంకులను సృష్టించి దర్యాప్తు సంస్థలను విచారణను నీరుగార్చలేమని ఆయన అన్నారు. హైకోర్టులో ఎలాంటి ఉపశమనమూ లభించకపోవడంతో చిదంబరం ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు తక్షణ ఉపశమనమేదీ లభించనప్పటికీ, ఆయన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరిస్తూ సాయంత్రం 3.40 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. మొదట సీబీఐ, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈడీ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడలేదు. చిదంబరం ఇంటికి రావడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించినా వారు నోరు మెదపలేదు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. చిదంబరం పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వలేం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చిదంబరంపై ఈ కేసులు పెట్టారని ఇప్పుడే చెప్పడం అర్థం లేని పని.’ – ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గౌర్ ‘మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ హడావుడిగా సాయంత్రం 3.40 గంటలకు ఈ తీర్పు చెప్పారు. ఈ తీర్పును ఈ ఏడాది జనవరిలోనే రిజర్వ్‌లో ఉంచారు. మరో మూడు రోజులు ఆగి తీర్పును వెలువరించాలని కోరాం. అయినా జస్టిస్ గౌర్ మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా మంగళవారమే తీర్పు ఇచ్చారు.’ – కపిల్ సిబల్, చిదంబరం తరఫు న్యాయవాది ఐఎన్ఎక్స్ కేసు ఇదీ.. 2007– ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. ► 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. ► 2018 : ఐఎన్ఎక్స్ మీడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ► 2018 మే 30 : సీబీఐ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం. ► 2018 జూలై 23:ఈడీ కేసులోనూ ముందస్తు బెయిలు ఇవ్వాలని మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన చిదంబరం. ► 2018 జూలై 25 : ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ తొలిసారి ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత పలుమార్లు ఆ గడువు పొడిగింపు. ► 2019 జనవరి 25: ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు. ► 2019 ఆగస్టు 20 : తీర్పు చెబుతూ, చిదంబరం బెయిలు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. -
చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి
న్యూడిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు. -
పోలీసుల కస్టడీకి రాజీవ్, శ్రావణ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. రాజీవ్, శ్రావణ్లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. -
4రోజుల కస్టడీకి శ్రవణ్, రాజీవ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.