
స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్
తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్‌లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment