shirisha suicide
-
పోలీసుల కస్టడీకి రాజీవ్, శ్రావణ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. రాజీవ్, శ్రావణ్లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. -
4రోజుల కస్టడీకి శ్రవణ్, రాజీవ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. -
వివాహితుడితో పెళ్లి వద్దన్నందుకు...
ఏలూరు : తన కాలనీలో ఉండే వివాహితుడిని ఓ యువతి ప్రేమించింది. అతడితో పెళ్లికి సైతం సిద్ధమైంది. వివాహితుడిని పెళ్లిచేసుకోవద్దని తల్లిదండ్రులు వారించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపర్తి సింహాద్రి, అప్పాయమ్మ దంపతులకు మూడో కుమార్తె శిరీష (19). ఆమె పదవ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, శిరీష తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుని జీవిస్తుంటారు. తమ కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో శిరీష పరిచయం పెంచుకుంది. అయితే సూరిబాబుకు ఏడాది క్రితమే పెళ్లయింది. అయినప్పటికీ తనకు అతనితోనే వివాహం జరిపించాలంటూ శిరీష పట్టుబడుతోంది. అందుకు ఆమె తల్లిదండ్రులు సింహాద్రి, అప్పాయమ్మలు అంగీకరించకపోవటంతో మనస్తాపానికి లోనైంది. దీంతో గురువారం ఎవరు లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది.