ప్రేమ పందెంలో గెలుపు ఎవరిది? | Prema Pandem Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ప్రేమ పందెంలో గెలుపు ఎవరిది?

Published Sat, Nov 4 2017 1:22 AM | Last Updated on Sat, Nov 4 2017 1:22 AM

Prema Pandem Movie Audio Launch - Sakshi

‘‘చిన్న సినిమాలు చాలావరకు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ షూటింగ్‌ దశలోనే ఆగిపోతున్నాయి. లక్ష్మీనారాయణగారికిది తొలి సినిమా అయినా షూటింగ్‌ పూర్తి చేసి, సినిమా విడుదల చేస్తుండడం అభినందనీయం. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ అన్నారు. శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేంటో  సినిమాలోనే చూడాలి. మా యూనిట్‌ సభ్యుల సహకారం వల్లే అను కున్నట్లు నిర్మించగలిగాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రేమపందెం’ కేవలం యూత్‌ మూవీ కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి’’ అన్నారు అర్జున్‌. తెంగాణ ఫిలిం చాంబర్‌ కార్యదర్శి యన్‌. సాయివెంకట్, సంగీత దర్శకుడు వెంకట్‌ ఎస్‌.వి.హెచ్‌. పాల్గొన్నారు. ఈ సినిమాకి సహకారం: శరత్‌సాగర్, కో–ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement