అక్రమాలు బయటపడతాయనే...
జీవోల వెబ్‌సైట్ నిలిపివేతపై శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న అక్రమాలు బయటపడొద్దనే జీవోల వెబ్‌సైట్‌ను నిలిపేశారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. జీవోల వెబ్‌సైట్‌ను నిలిపేయడంపై జీఏడీ, ఐటీ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద మంగళవారం దరఖాస్తు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ టెండర్లు, పరిపాలనా పరమైన విషయాలు, పారిశ్రామిక విధానం, ఇసుక కేటాయింపులు, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు వంటి వాటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. నోటా ఏర్పాటు చేయకపోవడం, ఈవీఎంలలో ట్యాంపరింగ్ వ్యవహారం, ప్రింటర్లు ఏర్పాటు చేయకపోవడం లాంటి వాటిపై అన్ని రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేశామన్నారు.