
శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమపందెం’. ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్టర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘గతంలో ఐదేళ్లు జర్నలిస్ట్‌గా పనిచేశా. అర్జున్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించా.
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయి అవుట్‌పుట్ ఇచ్చాడు మా దర్శకుడు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఆసక్తి కలిగించే కథ ఇది. అటు ఎమోషన్, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సన్నివేశాలున్నాయి. ఈ సినిమాకి కథే హీరో’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఓబయ్య సోమిరెడ్డిపల్లె.
Comments
Please login to add a commentAdd a comment