బంగారు తెలంగాణ అంటే లాఠీఛార్జీలా?
హైదరాబాద్:బంగారు తెలంగాణ అంటే లాఠీఛార్జీలు చేయించడమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల నెత్తురు చిందించడం తెలంగాణకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలిపారు. నిజాం నియంతృత్వ ధోరణి ఈ ప్రభుత్వంలో కనబడుతోందన్నారు. మెదక్ లో రైతులపై జరిగిన లాఠీఛార్జీలో గాయపడ్డ బాధితులను బీజేపీ నేతలు మీడియా ముందుకు తీసుకొచ్చారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నిరంకుశత్వం, అకృత్యాలు, అరాచక పాలనకు సాక్షీభూతంగా నిలిచిన గోల్కొండ కోటను దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు వేదికగా ఎంపిక చేయటానికి కారణమేంటో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజలకు వివరణ ఇవ్వాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా అడ్డుపడ్డ నిజాం పాలన సాగిన కోటపై దేశ జెండా ఎగురవేయాలనేది సీఎం సొంత కుటుంబ విషయం కాదని, జాతీయ పండగ అయినందున ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.