గోల్కొండ కోటలో ‘నో యువర్ ఆర్మి’మేళాను ప్రారంభించిన జిష్ణుదేవ్‌వర్మ
గోల్కొండ (హైదరాబాద్): రక్షణ రంగంలో భారత దేశం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ఆయన ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఆర్మీ’మేళాను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యం వాడే ఆయుధాలను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత గవర్నర్ ఒక్కో స్టాల్‌ను తిరిగి అక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆయుధాలను చూసి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ యుద్ధంలో వాడే వివిధ రకాల ఆయు« దాలను ఎక్కువ శాతం మన దేశమే సొంతంగా తయారు చేసుకుంటోందన్నారు. మన దేశం రక్షణ రంగంలో ప్రపంచంలోనే మేటి అని, అత్యాధునికమైన, ఖరీదైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటి సారి ఆర్మీవారు తమ ఆయుధాలను ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారని తెలిపారు. అనంతరం గవర్నర్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ‘నో యువర్ ఆర్మి’మేళా పర్యాటకులతో పాటు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
‘నో యువర్ ఆర్మీ’మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment