Jishnu Dev Varma
-
గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ‘నో యువర్ ఆర్మీ’ మేళా (ఫొటోలు)
-
రక్షణ రంగంలో భారత్ అగ్రగామి: గవర్నర్
గోల్కొండ (హైదరాబాద్): రక్షణ రంగంలో భారత దేశం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ఆయన ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఆర్మీ’మేళాను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యం వాడే ఆయుధాలను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత గవర్నర్ ఒక్కో స్టాల్‌ను తిరిగి అక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆయుధాలను చూసి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడు తూ యుద్ధంలో వాడే వివిధ రకాల ఆయు« దాలను ఎక్కువ శాతం మన దేశమే సొంతంగా తయారు చేసుకుంటోందన్నారు. మన దేశం రక్షణ రంగంలో ప్రపంచంలోనే మేటి అని, అత్యాధునికమైన, ఖరీదైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటి సారి ఆర్మీవారు తమ ఆయుధాలను ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారని తెలిపారు. అనంతరం గవర్నర్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ‘నో యువర్ ఆర్మి’మేళా పర్యాటకులతో పాటు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.‘నో యువర్ ఆర్మీ’మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
పుస్తకం చదివితేనే నిజమైన అనుభూతి
సాక్షి, హైదరాబాద్: రచయితకు, పాఠకుడికి మధ్య ఒక అనిర్వచనీయమైన అనుబంధాన్ని ముడివేసేది పుస్తకమేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చేతుల్లో పుస్తకాన్ని పట్టుకొని చదివినప్పుడు మాత్రమే నిజమైన పుస్తక పఠన అనుభూతిని ఆస్వాదించగలమని చెప్పారు. పాఠకుడు, రచయిత కలిసి సంభాషించుకుంటున్నట్లుగా ఉంటుందన్నారు. ఆడియో పుస్తకాలు, ఈ–బుక్స్, ట్యాబ్స్, కంఫ్యూటర్లు అలాంటి అనుభూతిని ఇవ్వలేవని, అవి కేవలం మిషన్లు మాత్రమేనని పేర్కొన్నారు. గవర్నర్ శనివారం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పుస్తకమే జ్ఞానం, పుస్తకాన్ని మించిన గొప్ప సహచర్యం మరొకటి లేదని గవర్నర్ చెప్పారు. మానవ నాగరికతా పరిణామం, మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక జీవన విధానం, వేదాలు, ఉపనిషత్తులు తదితర సాహిత్యమంతా పుస్తకంలోనే నిక్షిప్తమై ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ పుస్తకాన్ని ఏమాత్రం భర్తీ చేయలేదన్నారు. కాలనీలు, బస్తీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను విరివిగా ప్రోత్సహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో జాతీయ స్థాయిలో అద్భుతమైన పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకం బహుమతిగా ఇవ్వండి సభలు, సమావేశాలు, వేడుకల్లో పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని పాటించాలని గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, పండుగల్లోనూ పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం ద్వారా మంచి పుస్తక పఠనాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. పుస్తక ప్రదర్శనను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదవాలని, చదివించాలని పిలుపునిచ్చారు.అంతకుముందు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుక్ డొనేషన్ బాక్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దాతల నుంచి సేకరించిన పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథా లయాలకు, విద్యార్థులకు అందజేసేందుకు బుక్ ఫెయిర్ కమిటీ ఈ బాక్సును ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ సంస్థ, అక్షరయాన్ తదితర స్టాళ్లను గవర్నర్ ఆసక్తిగా సందర్శించారు. ఈ కార్య క్రమానికి అధ్యక్షత వహించిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు, కవి యాకు బ్ మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్, బుక్‌ఫెయిర్ కమిటీ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ సీఎస్ఐ చర్చిలో గవర్నర్ ప్రార్థనలు
-
క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్ చర్చి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/చిలిప్చేడ్: మెదక్ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు ఈ ఆలయం నిదర్శనమని, శాంతిని కోరుకునే వారికి మార్గ నిర్దేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) సంఘ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.గవర్నర్ రాక పురస్కరించుకుని ప్రెసిబెటరి ఇన్చార్జి శాంతయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు కేవలం వందేళ్ల సంబరమే కాదని, మానవ విశ్వాసం, దేవుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టమని అభివర్ణిం చారు. ఈ సందర్భంగా బైబిల్లోని.. ‘ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారో.. అక్కడ నేను ఉంటాను..’అనే క్రీస్తు వచనాలను గవర్నర్ ఉటంకించారు. ఈ చర్చి శతాబ్దంగా దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందని, ఒక విశ్వాసాన్ని పెంపొందించిన స్థలం గానే కాకుండా, అనేకమంది జీవితాలను మార్చిన ప్రదేశంగా నిలిచిందని చెప్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనకు ఇచి్చనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్ చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలి విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వారని, వారు సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, కలలు సాకారం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మంచి నాగరికతను పుణికి పుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలని కోరారు. కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు ఆదర్శమని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
సాగులో సాంకేతికత పెంచండి..
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రైతులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను చాన్స్‌లర్ హోదాలో శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రా లని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2047 నాటికి వ్యవసాయ రంగంలో విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గడిచిన 60 ఏళ్లుగా వర్సిటీ అసమాన సేవలందిస్తూ.. సోనామసూరి, తెలంగాణ సోనా వంటి ఎన్నో కొత్త వంగడాలను అభివృద్ధి చేసిందని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. ఉద్యానవన పంటల సాగు పెరగాలి: తుమ్మల రాష్ట్రంలో వరి, పత్తి, మిరప పంటల సాగును తగ్గించి.. కూరగాయలు, ఆయిల్‌పామ్, ఇతర ఉద్యాన పంటల సాగు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతాంగానికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు పంటల సాగును సూచించాలని కోరారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ‘మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్’ను అభివృద్ధి చేయాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల సౌకర్యం పెరగటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని.. అదే సమయంలో కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు నాదెండ్ల భాస్కర్‌రావు, సమరసింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజ్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజిరెడ్డి, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర్రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవరెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా– ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావుపై కేసు నమోదు, విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ–కార్ రేస్ వ్యవహారంపై ‘కేటీఆర్ చుట్టూ ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు జరిపిన రూ.55 కోట్ల చెల్లింపులపై విచారించడానికి 2018 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద అనుమతి కోరింది. ఈ చెల్లింపులకు అప్పటి హెచ్ఎండీఏ పాలకమండలి అమోదం కూడా లేదని, అంతేకాక ఈ నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్లు ప్రభుత్వం గవర్నర్‌కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెల్లింపులకు అనుమతినిచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ కూడా అయిన అర్వింద్‌కుమార్ చెల్లింపులు చేశారు. గవర్నర్‌తో రేవంత్ భేటీలోనూ ‘విచారణ’ ప్రస్తావన! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కూడా కేటీఆర్ విచారణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ త్వరగానే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల సమాచారం. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా–ఈకి రూ.55 కోట్లు చెల్లింపునకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తనదేనంటూ ప్రకటించగా, ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఆటం బాబు పేలబోతుందంటూ వ్యాఖ్యానించడం.. రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి సంకేతాలనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి తప్పనిసరి! ఫార్ములా–ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి అర్వింద్‌కుమార్‌తో పాటు సంబంధిత ఇంజనీర్లపై విచారణకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా విచారణ అనంతరం ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్ చేయడానికి మాత్రం కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం (డీవోపీటీ) అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. డీవోపీటీకి మాత్రమే ఐఏఎస్‌ను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఉన్నందున వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ కమిషనర్‌గా పనిచేసిన బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన వ్యవహారంలోనూ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం విదితమే. ఏమిటీ సెక్షన్ 17(ఏ).. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిదంటూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉండడంతో.. ఆ కక్ష సాధింపును నివారించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17(ఏ)ను కొత్తగా చేర్చింది. ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కే ఉన్నందున, వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై, వారు మాజీలైన తర్వాత కేసులు నమోదు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి. కాగా 2018లో చట్ట సవరణ తర్వాత నమోదు చేసే కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. -
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సంగమమే భారత్: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల సంగమమే భారతదేశమని రాష్ట్ర గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వ్యాఖ్యానించారు. నవంబర్ 1న దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాజ్‌భవన్‌లోని సంస్కృతి హాలులో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే నినాదంతో భారతదేశ కీర్తిని ప్రధాని నరేంద్రమోదీ విశ్వవ్యాప్తం చేశార న్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకున్న రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. శుక్రవారం వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణాæ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్–నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు న్నాయి. ఈ వేడుకల్లో పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం ఇచ్చిన కూచిపుడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. -
చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.తర్వాత రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ప్రత్యేక వార్డులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, ముజమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్ కు కంప్లైంట్ చేసిన ఈటల రాజేందర్
-
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.