రాజ్‌భవన్‌లో ఘనంగా 8 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల సంగమమే భారతదేశమని రాష్ట్ర గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వ్యాఖ్యానించారు. నవంబర్ 1న దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాజ్‌భవన్‌లోని సంస్కృతి హాలులో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజర య్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే నినాదంతో భారతదేశ కీర్తిని ప్రధాని నరేంద్రమోదీ విశ్వవ్యాప్తం చేశార న్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకున్న రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. శుక్రవారం వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణాæ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్–నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు న్నాయి. ఈ వేడుకల్లో పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం ఇచ్చిన కూచిపుడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment