కోటలో వీఐపీల కోసం ప్రత్యేక గాలరీలు | Golconda Fort getting ready for 15th August | Sakshi
Sakshi News home page

కోటలో వీఐపీల కోసం ప్రత్యేక గాలరీలు

Published Tue, Aug 12 2014 10:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Golconda Fort getting ready for 15th August

హైదరాబాద్ :  గోల్కొండ కోటలో పంద్రాగష్టు వేడుకలకు హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వీఐపీలతో పాటు అయిదువేల మందికి పాసులు ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు గోల్కొండ కోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోట చుట్టూ 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేడుకల భద్రతా ఏరాట్లను మహేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు.

కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దిన వేడుకలు గతంలో కంటే భిన్నంగా జరుగనున్నాయి. యూనిఫాం సర్వీసుల కవాతు.. వివిధ శాఖల శకటాలు వంటివేమీ లేకుండా ప్రభుత్వం సాధారణంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించగా  ....గోల్కొండ కోటలో నిర్వహించాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

 

పంద్రాగస్టు వేడుకల్లో సీఎం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) మాత్రమే స్వీకరిస్తారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తరువాత సీఎం వేడుకలకు వచ్చిన అతిథులతో కరచాలనం చేస్తూ పలకరిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement