వేడుకలపై పోలీసుల డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటలో సోమవారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసులు డేగకన్ను వేశారు. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు నగర పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో అణువణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తం 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీసుస్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు.
కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా గోల్కొండ కోటకు చుట్టుపక్కల మార్గాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇక్కడి అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి ఆదివారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి కోటను, రాజ్‌భవన్‌ను సందర్శించి అవసరమైన మార్పు చేర్పులు సూచించారు. కోటకు వచ్చే సందర్శకులు తవు వెంట హ్యాండ్ బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్‌బాటిళ్లు తదితర వస్తువులు తీసుకురావడం నిషేధించారు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా... కచ్చితంగా సోదా చేస్తారు.
నగర వ్యాప్తంగా తనిఖీలు...
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ వుువ్మురం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసవుర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనువూనిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వుఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వేడుకలు చూడటానికి వచ్చే ప్రముఖులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు, పార్కింగ్స్ కేటాయించారు.