గోల్కొండ కోట సందర్శన వేళలను స్వల్పంగా మార్చారు.
గోల్కొండ కోట సందర్శన వేళలను ఒక గంట పెంచారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు వేళలను మార్చినట్లు కోట సీనియర్ పరిరక్షణ అధికారి ఎం.సాంబశివ రావు తెలిపారు. సవరించిన వేళల ప్రకారం కోటను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ తెరిచి ఉంచుతారు. ఇప్పటి వరకూ కోటను ఉదయం 9 గంటలకు తెరిచే వారు. లైట్ షో షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు.