గోల్కొండ : గోల్కొండ కోటలో పంద్రాగస్టు ఏర్పాట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పంద్రాగస్టు రోజున గోల్కొండ కోటలో జరిగే పతాకావిష్కరణ కార్యక్రమ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని పతావిష్కరణగావించనున్నారు. ఈ ఏర్పాట్లను అధికారులు సోమవారం ప్రారంభించారు. గోల్కొండ మెయిన్ గేటు, గోల్కొండ లాన్స్, పతావిష్కరణ జరిగే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించే పనులు ప్రారంభమయ్యాయి. కోట గోడలపై విద్యుత్ దీపాలను, జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ అనంతరం Sపతాకావిష్కరణ జరిగే ప్రాంతంలో మంత్రులు, వీఐపీలు కూర్చొనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని అధికారులు అంటున్నారు.