
బోనమెత్తిన గోల్కొండ
అమ్మా బెలైల్లి నాదో.. తల్లీ బెలైల్లి నాదో.. అంటూ బోనాల సందడి గోల్కొండలో షురూ అయింది.
పోతరాజుల నృత్యాలు.. శివసత్తుల ఊరేగింపులతో.. డప్పుచప్పుళ్లతో గోల్కొండ మార్మోగింది.
జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు కోటకు పోటెత్తారు.
గోల్కొండ: గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటకు వెళ్లే దారుల్లో భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. అమ్మవారి చల్లని చూపు కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో కోటలో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలతో పూజలు చేశారు. తలపై బోనంలతో మెట్ల మార్గాన కోటపై కొలువుదీరిన అమ్మవా రి వద్దకు తరలి వెళ్లారు. భ క్తి గీతాలు, పోతరాజుల నృత్యాలతో గోల్కొండ పులకించింది. గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది వారం మూడవ పూజ వైభవంగా జరిగింది.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవార్లకు సమర్పించుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన తొట్టెలతో భక్తులు ఊరేగింపుగా కోటకు చేరుకున్నారు. కోట చౌరస్తా వద్ద పోతరాజులు తమ విన్యాసాలతో ఓ వైపు, మరోవైపు శివసత్తులు కట్టి పడేశారు. నగినాబాగ్‌లో బండి ముగ్గులు, నైవేద్యాల తయారీతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకోల్పాయి. యువకులు ఫుల్ జోష్‌తో అమ్మవారి పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేవారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ సాంస్కృతిక మండలి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు అమ్మవారిని ద ర్శించుకున్నారు. తొట్టెల ఊరేగింపులో ఆలయ పునరుద్ధరణ కమిటి ైఛె ర్మన్ గోవింద్‌రాజ్ కోయల్‌కర్, ఎస్.రాజువస్తాద్ తదిత రులు ఉన్నారు.
పోటెత్తిన భక్తులు
కోటపై కొలువుదీరి ఉన్న శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఆదివారం ఉదయం నుంచే కోటకు వచ్చే మార్గాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. కోట మెట్ల మార్గమద్యలో ఉన్న రామదాసు బందీఖాన నుంచే క్యూ మొదలైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి మహేంద్రకుమార్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు అనంతచారి, బి.సాయిబాబచారి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.
విజయవాడ కనకదుర్గమ్మకు బోనాలు, పట్టు వస్త్రాలు
చార్మినార్: శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు, 11 బోనాలను సమర్పించారు. మేళాలు, బాజా బజంత్రీలు, కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు ఎ. భాస్కర్, గాజుల అంజయ్య, ప్యారసాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.