హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చరిత్రలో నిలిచే పోయేలా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిచింది. చారిత్రక గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాలను ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఇప్పటివరకు నిర్వహిస్తూ వస్తున్నారు. గోల్కోండ కోట వద్ద నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శించేందుకు తెలంగాణ శకటాలు రెడీ అవుతున్నాయి.
గోల్కోండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు
Published Sun, Aug 3 2014 9:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Advertisement