Independence day celebration
-
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
పంద్రాగస్టు వేడుకలు : జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పంద్రాగస్టు వేడుకలు: జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024 -
హైదరాబాద్ : సగర్వంగా..‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఎర్రకోట : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ (ఫొటోలు)
-
పంచాయతీలకు ప్రభుత్వం ట్విస్ట్
-
Independence Day 2023: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
AP: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వానితులు, పాస్‌లు ఉన్నవారు మంగళవారం ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు(ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. సీఎం జగన్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేడుకలకు ఏర్పాట్లు.. రాష్ట్ర హైకోర్టు, శాసన మండలి, శాసనసభ, సచివాలయ ప్రాంగణాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ దీపాలతో ఆ భవనాలను ముస్తాబు చేశారు. కాగా, మంగళవారం ఉదయం 7.45 గంటలకు శాసన మండలి వద్ద మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఉదయం 8.15 గంటలకు శాసనసభ వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉదయం 7.30 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10 గంటలకు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పాల్గొని.. మువ్వన్నెలజాతీయ జెండాను ఎగురవేస్తారు. -
ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని
సాక్షి, బళ్లారి: నేడు ఢిల్లీలోని ఎర్రకోటపై జరగనున్న 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ సామాన్య మహిళకు అవకాశం దక్కింది. కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన పుష్పావతి సోమప్ప అనే మహిళ రాణిబెన్నూరు తాలూకా చిక్కకురువత్తి గ్రామ పంచాయతీలో నీరుగంటి(వాటర్‌ఉమెన్)గా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. భర్త సోమప్ప గతంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో ఆ ఉద్యోగం భార్య పుష్పావతికి దక్కింది. పుష్పావతి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు బెంగళూరు కూడా చూడలేదన్నారు. ప్రస్తుతం విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు తనకు పిలుపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ...(ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడింది
-
ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు
-
వెయ్యి అడుగుల జాతీయ జెండా (ఫొటోలు)
-
తిరుపతి పురవీధుల్లో మార్మోగిన స్వతంత్ర నినాదం
-
'నయా భారత్ కా సప్నా' ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్
Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. Koo App One step for the nation. #nayebharatkasapna #swatantratasankalp View attached media content - Karan Johar (@karanjohar) 1 Aug 2022 -
వైఎస్ జగన్ పాలన దేశానికే మార్గదర్శకం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పాలన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలను ఆదుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ..‘ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 80 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరింది’ అని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా ఈ రోజు పేదలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించేదని.. కానీ టీడీపీ కుయుక్తుల వల్ల అది వాయిదా పడిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎన్.పద్మజ, ఎ.నారాయణమూర్తి, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. -
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. -
‘వైట్ హౌజ్‌లో హిస్టరీ బుక్స్ లేవా?’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అధ్యక్షుడే అంటే.. ఆయనకు పోటీగా వైట్ హౌస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకంటే.. ఈ నెల 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా గొప్పతనాన్ని చాటడం కోసం ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికన్లు విద్యుత్తును ఉపయోగించుకున్నారు. అణువును విభజించారు. ప్రపంచానికి టెలిఫోన్, ఇంటర్నెట్ ఇచ్చారు. మేము వైల్డ్ వెస్ట్‌ను స్థిరపర్చాము. రెండు ప్రపంచ యుద్ధాలను గెలిచాము. అమెరికన్ వ్యోమగాములు చంద్రునిపై కాలు మోపారు. త్వరలోనే అంగారక గ్రహంపై మా జెండా ఎగర వేస్తాము’ అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలికారు. (‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’) "Americans harnessed electricity, split the atom, and gave the world the telephone and the internet. We settled the Wild West, won two World Wars, landed American Astronauts on the Moon—and one day soon, we will plant our flag on Mars!" — President @realDonaldTrump — The White House (@WhiteHouse) July 6, 2020 అధ్యక్షుడే మిస్టేక్ చేశాడంటే.. వైట్ హౌస్ మరో అడుగు ముందుకు వేసి ట్రంప్ వ్యాఖ్యలను యథాతథంగా ట్వీట్ చేసింది. ఇంకేముంది నెటిజనులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘వైట్ హౌస్‌లో కనీసం చరిత్ర పుస్తకాలు కూడా లేవా’ అని ప్రశ్నిస్తున్నారు. ఇదేకాక కరోనా విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే అమెరికాలో ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు ట్రంప్. టెస్టుల సంఖ్య తగ్గిస్తే.. కేసులు కూడా తగ్గిపోతాయన్నారు. -
టెక్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
టెక్సాస్ : భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో జెండా పండుగలో పాల్గొన్నారు. మ్యూజిక్ టీచర్ స్వాతీ జాతీయ గీతాలాపన అనంతరం.. ఎంజీఎంఎన్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం ఆస్కార్ వార్డ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. గోపాల్ పోనంగి, ఫ్రిస్కో ఐఎస్డీ బోర్డ్ ట్రస్టీ.. మనీష్ సేథి, కోపెల్ ఐఎస్డీ బోర్డు ట్రస్టీ.. వాస్త రామనాథన్, అలెన్ ఐఎస్డీ బోర్డు ట్రస్టీ రాజ్ మీనన్, కోలిన్ కమ్యూనిటీ కాలేజ్ డిస్ట్రిక్ట్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ టై బ్లెడ్సో, స్థానిక అధికారులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కాల్వ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ మెమోరియల్‌ప్లాజా నిర్మించేందుకు సహకరించిన ఇర్విన్ నగర అధికార యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు. 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వ నిర్ణయం చాలా సంతోషం కలిగించిందని ప్రసాద్ తోటకూర అన్నారు. ప్రోగ్రామ్‌ను ప్రసారం చేసిన టీవీ చానెళ్లకు ధన్యవాదాలు తెలిపారు. -
కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం
సాక్షి, అమరావతి: ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్ చేసే సమయంలో ఆ పతకం పోలీస్ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్కే అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ (91) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఆయన ఆగస్టు 15న తన నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీకి వైరల్ ఫీవర్ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. గత అయిదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది.