రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది
మంత్రులతో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు, విప్‌లకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన జిల్లాల సంఖ్యకు తగిన సంఖ్యలో రాష్ట్రంలో మంత్రులు అందుబాటులో లేరు. మొత్తం 31 జిల్లాలుంటే ముఖ్యమంత్రిసహా 18 మంది మంత్రులున్నారు. దీంతో మిగతా 13 జిల్లాలకు మంత్రులు అందుబాటులో లేకపోవటంతో జాతీయ జెండా ఎగురవేసే బాధ్యతలను ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్‌లు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే జిల్లాలో ఎవరెవరు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపడతారనే వివరాలను ఇందులో పొందుపరిచారు.