
మువ్వన్నెల జెండా మెరిసింది. పాతబస్తీలో తిరంగా మురిసింది. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ జెండాల ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు. దారుషిఫా గ్రౌండ్ నుంచి బయలుదేరిన తిరంగా ర్యాలీ చార్మినార్ వరకు కొనసాగింది. విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
















