har ghar tiranga
-
హైదరాబాద్ : సగర్వంగా..‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెలీ్ఫలను ‘హర్ ఘర్ తిరంగా’వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని శనివారం ఆయన ‘ఎక్స్’లో కోరారు. ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. -
ఫోన్లలో మారుమోగుతున్న ‘హర్‌ఘర్ తిరంగా’
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ఈ సందర్భంగా దేశ పౌరులు తమలోని దేశభక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలువురి ఫోన్లలో ‘హర్ ఘర్ తిరంగా' కాలర్ ట్యూన్ మారుమోగుతోంది. ఫోన్ చేసినప్పుడు హర్ ఘర్ తిరంగా సందేశం వినిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ మోరుమోగింది. ఈ సారి కూడా పలువురికి ఫోన్ చేసినప్పుడు హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలనే సందేశం వినిపిస్తోంది. జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ కాలర్ ట్యూన్లను మార్చారు. జెండా సందేశం తర్వాత హర్ ఘర్ తిరంగా థీమ్ సాంగ్‌కు సంబంధించిన చిన్న క్లిప్ ప్లే అవుతోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అత్యంత వైభవంగా జరుపుకునే 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. In the spirit of the #HarGharTiranga movement, let us change the DP of our social media accounts and extend support to this unique effort which will deepen the bond between our beloved country and us. — Narendra Modi (@narendramodi) August 13, 2023 -
వజ్రోత్సవాల్లో జాతీయ పతాకాల వినియోగం.. వాటిని ఇప్పుడేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటింకే కాదు.. తమ దేశ భక్తి చాటుకోడానికి వాహనాలకు, పబ్లిక్ ప్లేస్ల్లో, పార్కులలో, కార్యాలయాల్లో విస్తృతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈసారి పంద్రాగస్టున లక్షల సంఖ్యలో జెండాలను ఘనంగా రెపరెపలాడించారు. కానీ జాతీయ జెండా అతి గౌరవప్రదమైనది. జెండాను ఎగురవేయడంలో, వినియోగించడంలో ఫ్లాగ్ కోడ్ విధిగా పాటించాలి. వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ జెండాలను ఏ విధంగా పరిరక్షిస్తారు, ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా అగౌరవపరచకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అంశాలపైన అవగాహాన పెరగాల్సిన అవసరముంది. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు పరిరక్షణ బాధ్యతలపై వెలువడని మార్గదర్శకాలు.. ఇంటింటికీ ఎగరేసిన జెండాలను జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాల్సిన భాద్యత ఆ ఇంటి వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ర్యాలీల పేరుతో వాహనాలకు కూడా జాతీయ జెండాను వినియోగించారు. వజ్రోత్సవాల అనంతరం వీటినన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరముంది. ఈ విషయంలో మరింత అవగాహాన పెరగాలని, లేదంటే ఘనంగా నిర్వహించిన వేడుకల పేరుతో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లలో, పార్క్‌లు, వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌పాత్, ఫ్లైఓవర్, గ్రౌండ్స్, కూడళ్ల వద్ద భారీస్థాయిలో జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. మరికోద్ది రోజుల్లో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. జెండాను అమర్చిన ప్రదేశం, సంస్థలను బట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి ఇంకా ఎలాంటి మార్గ నిర్దేశకాలు విడుదల కాలేదు. జాతీయ పతాకాన్ని ఏ మాత్రం అగౌరవ పరచినా చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవు. కాబట్టి జెండాల విషయంలో పౌరులు సంబంధిత సంస్థలు బాధ్యతాయుంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. చదవండి: రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది? -
ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
వైరల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్‌గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ — anand mahindra (@anandmahindra) August 14, 2022 Next level it is! Love this young couple ❤️ — Jhony Bravo (@mahesh_s_savita) August 14, 2022 No word yet only Jai Hind 🙏🙏 — ramaekrisshna (@ramakrishna183) August 14, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. ఇదీ చదవండి: భారత్‌కు పాక్ మ్యూజిషియన్ ఊహించని కానుక -
డిజిటల్ దేశభక్తి: మువ్వన్నెల జెండా సెల్ఫీలతో రికార్డు బద్ధలు!
ఢిల్లీ: కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది. ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది. ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్సైట్ నిండిపోతోంది. సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్ దాటాం’ అని పౌరులను అభినందించింది. మంగళవారం ఉదయం కూడా వెబ్సైట్లోకి ఫోటోలు అప్లోడ్ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: స్వాతంత్ర వేడుకల్లో గాంధీ ఎందుకు పాల్గొనలేదో తెలుసా? -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్‌కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి) -
Sakshi Cartoon: హర్ ఘర్ తిరంగా
-
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్‌ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్‌ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
AP: సర్వం.. త్రివర్ణ శోభితం
మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్.. భారత్ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్వర్క్: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్– హర్ ఘర్ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు. ఎటు చూసినా అదే వేడుక స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తోంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 3 కి.మీ పొడవునా జాతీయ పతాకం ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. 300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది. – కడియం ‘జల’ జెండా! 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్ షీట్ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు. – రామచంద్రపురం రూరల్ -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. -
Har Ghar Tiranga: ఇంటింటా ‘తిరంగ’
ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూడు రంగుల విద్యుద్దీపాలంకరణలతో తళుకులీనుతున్నాయి. ప్రధాన కూడళ్లన్నీ జెండాలతో, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో ముస్తాబయ్యాయి... ప్రతి భారతీయుని గుండెలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది..అందరినోటా ఒకటే నినాదం.. జయహో భారత్.. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా.. జెండా ఊంఛా రహే హమారా..’ అనే గీతం వీనుల విందుగా వినిపిస్తోంది. ‘నా దేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత.. నా దేశం కరుణాంతరంగ.. నా దేశం సంస్కార గంగ..’ అన్న డాక్టర్ సినారే మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అందరి గుండెల నిండుగా దేశ భక్తి తాండవిస్తోందని ప్రతి ఊరు, వాడ, ఇల్లు.. త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర భారతావనికి కారకులైన మహోన్నతులందరికీ జయహో అంటూ పౌరులు శిరస్సు వంచి నమస్కరిస్తుండటం సాక్షాత్కరిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: దేశ గౌరవం ప్రతి ఇంటిపై స్వేచ్ఛా విహంగమై త్రివర్ణ పతాకం రూపంలో రెపరెపలాడుతోంది. రాష్ట్ర ప్రజలంతా మువ్వన్నెల జాతీయ జెండాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. బానిస సంకెళ్ల నుంచి భారతావనికి విముక్తి లభించి ఈ నెల 15 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా’ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతోంది. గవర్నర్ బంగ్లాలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుండగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఆవిష్కరించారు. సామాన్యులు మొదలు.. సీఎం వరకు ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాలపై, వ్యాపార, వాణిజ్య భవనాల సముదాయాల వద్ద.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందరిలోనూ ‘అమృత్’ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో జరుపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వందల అడుగుల పొడవున్న జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా వ్యాస రచన, వక్తృత్వ, నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల వేష ధారణలో పలువురు వేడుకల్లో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు లక్షకు పైగా అవగాహనా కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలు మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాలు పంచుకొనేలా నిర్వహించారు. ఎందరో వీరుల త్యాగ ఫలం మన ఈ స్వాతంత్య్రం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 278 మంది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను సన్మానించారు. మనిషి మనుగడకు మూలాధారమైన 399 చెరువులను ఆధునీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతటా జెండా స్ఫూర్తి అమృత్ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడాలు, విగ్రహాలు, ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరింత ప్రచారం కల్పించడం కోసం మూడు లఘు చిత్రాలను నిర్మించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన లఘు చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తితో పేదలకు జరుగుతున్న మంచిని వివరించారు. అన్ని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఈ త్రివర్ణ పతాక పండగలో మమేకం చేస్తూ, సమైక్య భావాన్ని చాటుతున్నారు. తద్వారా ప్రజల్లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యాక్రమం బాగా చొచ్చుకువెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లు.. వీధులు.. సామాజిక వేదికలు ఇలా సర్వం త్రివర్ణ శోభితమై ప్రకాశిస్తూ స్వతంత్ర భారతావనికి జయహో అంటున్నాయి. ఊరూరా సందడే సందడి కర్నూలు నగరానికి తలమానికమైన జగన్నాథగట్టుపై మొదటిసారి 10 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శనివారం మువ్వన్నెలతో మెరిసింది. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కైకలూరులో నేషనల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఒక కిలోమీటర్ పొడవున జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ర్యాలీలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా అల్లవరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కాకినాడలో మూడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో 105 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో సైతం జాతీయ జెండాలు రెపరెపలాడాయి. 3.5 కి.మీ పొడవైన జాతీయ పతాకంతో మానవహారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం మూడున్నర కిలోమీటర్ల పొడవున్న జాతీయ పతాకంతో మానవహారం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, విడదల రజని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జెండా రూపకర్త నివాసం నుంచే మొదలు 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందు.. అంటే 2021 మార్చి 12న ప్రారంభమైన ఈ సంబరాలు.. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాల్లో భాగంగా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ (హర్ ఘర్ తిరంగా) అనే కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశమంతటా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కోరింది. గతేడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి ఈ వేడుకలను ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వాతంత్య్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సత్కరించడం ద్వారా రాష్ట్రంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పౌరులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా ‘‘ఇంటింటా జాతీయ జెండా’’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ వేడుకలను ప్రజల పండుగగా నిర్వహిస్తోంది. -
హర్ ఘర్ తిరంగాలో అపశ్రుతి.. మాజీ మంత్రికి గాయం
అహ్మదాబాద్: డెబ్భై ఐదేళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగాకు పిలుపు ఇచ్చింది. ఇంటా వాకిట బడి బండ్లు అనే తేడా లేకుండా అంతటా మూడు రంగుల మయం అయిపోయింది. మరోవైపు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గుజరాత్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు. శనివారం మెహ్సనా జిల్లా కడి ప్రాంతంలో ఆయన నేతృత్వంలో ర్యాలీ జరిగింది. అయితే వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. ఆవు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో.. ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆపై ఎస్కార్ట్ సాయంతో అహ్మదాబాద్ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని, నెలరోజుల రెస్ట్ అవసరమని బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. Stray cow attacks Gujarat's former Deputy CM Nitin Patel during "Har Ghar Tiranga" yatra in Mehsana. pic.twitter.com/pwlmqRi7nT — Saral Patel (@SaralPatel) August 13, 2022 He is former Dy. CM @Nitinbhai_Patel today he got injured by a running cow. May Allah grant him speedy recovery. Questions that come to my mind 1.Who is responsible 4 dis accident? 2.The security personnel r private or still provided by d govt? @SandeepPathak04@SanjayAzadSln pic.twitter.com/Nsx8yYJNjm — Dr. Tohid Alam khan AAP 🇮🇳 (@aapkatohid) August 13, 2022 ఇదీ చదవండి: రాఖీలో విషాదం.. గాలిపటం దారం యమపాశమై! -
రాష్ట్రంలో కోటి జాతీయ జెండాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కోటి జాతీయ జెండాలను పింఛన్‌దారులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు మూడు కిలో మీటర్ల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు 399 చెరువులను ఆధునికీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని చాటేలా చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని వర్గాలను జెండా పండుగలో మమేకం చేయడానికి మూడు లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్టు వివరించారు. -
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా: బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్లు గరం!
Indian Flag On Houses.. దేశవ్యాప్తంగా ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘హార్ ఘర్ తిరంగా’లో భాగంగా జెండాలను ఎగురవేసేందుకు భారతీయలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జెండాలను ఎగురువేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జెండాల అంశంపై బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ.. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ఈ క్రమంలో ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే, మహేంద్ర భట్ ఈనెల 10వ తేదీన హల్ద్వానీలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దన్నారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలతో చెప్పారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచితేనే దేశ భక్తి ఉన్నట్లుగా, లేకపోతే దేశంపై వారికి నమ్మకం లేదు అంటూ.. ఆయన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, సర్దుకున్న మహేంద్ర భట్ మాట మార్చారు. తనకు ఎవరినీ అనుమానించే ఉద్దేశ్యం లేదన్నారు. ఫొటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లనే అంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే జాతీయ జెండాను ఇంటిపై ఉంచడంలో సమస్య ఏంటి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. Get photographs of houses not hoisting tricolour: #Uttarakhand BJP chief Mahendra Bhatt https://t.co/GrLMkULciE pic.twitter.com/jSd8B0Cra3 — The Times Of India (@timesofindia) August 12, 2022 ఇది కూడా చదవండి: దయచేసి ఆ విషయం అడగకండి.. సీఎం నితీష్ రిక్వెస్ట్ -
Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?
న్యూఢిల్లీ: జాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్ తిరంగా పిలుపులో కేవలం పది రోజుల్లో ఆన్లైన్లో పౌరులకు 1 కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ చిరునామాకైనా ఉచిత డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఆఫర్ చేస్తోంది. ఒక్కో త్రివర్ణ పతాకాన్ని 25 చొప్పున పౌరులు 1.75 లక్షలకు పైగా జెండాలను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో, తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేశారని డిఓపి తెలిపింది. ప్రభాత్ భేరీలు, బైక్ ర్యాలీ చౌపల్స్ సభల ద్వారా, సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకెళ్లామని వెల్లడించింది. "ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీ మరియు చౌపల్స్ సభల ద్వారా, ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకువెళ్లింది. ప్రోగ్రామ్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. డిజిటల్‌గా అనుసంధానించబడిన పౌరులు" అని పోస్టల్ శాఖ తెలిపింది. కాగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో చాలామంది ప్రజలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. What is Your Excuse??.. Tiranga Merit Shan 🇮🇳 HarGharTiranga🇮🇳 pic.twitter.com/qg6n2OR0aC — ट्विटर पर उपस्थित 🙄 (@aapki_harsha) August 12, 2022 p> “I can't see the flag, but I can feel patriotism by touching the flag” - Madhuri, class IX student.@IndiaPostOffice #HarGharTiranga pic.twitter.com/XnDfS8c8Hi — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2022 -
ఏపీలో త్రివర్ణ పతాక ర్యాలీలు(ఫొటోలు)
-
విజయవాడలో భారీ మువన్నెల జెండా (ఫొటోలు)
-
జెండా పేరుచెప్పి ఇలా చేస్తారా.. కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్
ఢిల్లీ/ఛండీగఢ్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రాలు కూడా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను తమ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ వేడుకలు పేదలకు భారంగా పరిణమించాయంటున్నారు బీజేపీ నేత వరుణ్ గాంధీ. బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర వ్యతిరేక స్వరం వినిపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరం అంటూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారాయన. రేషన్ కోసం వెళ్తున్నవాళ్లు.. జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామంటూ డీలర్లు బలవంతం చేయడం సిగ్గుచేటంటూ వరుణ్ గాంధీ ఆరోపించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో బతుకుతున్న 'తిరంగ'.. నిరుపేదల ఆహారాన్ని లాగేసుకోవడం సిగ్గుచేటన్నారు. आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा। राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है। हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV — Varun Gandhi (@varungandhi80) August 10, 2022 హర్యానా కర్నల్‌లో జాతీయ జెండా కోసం 20రూ. డిమాండ్ చేయడం, అలా కొంటేనే రేషన్ ఇస్తామని డీలర్లు బలవంతం చేయడం.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ రేషన్ డిపో ఓనర్ లైసెన్స్ రద్దు చేశారు. రేషన్ డిపోలో జాతీయ జెండాలు అమ్మకానికి ఉంచిన మాట వాస్తవమేనని, అయితే.. కొనుగోలు చేయాలని రేషన్ లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు అంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్‌గా మువ్వన్నెల జెండాలను ఉంచాలన్న ప్రధాని పిలుపునకు మంచి స్పందనే లభిస్తోంది. మరోవైపు యూపీ పిలిభిత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఈ మధ్యకాలంలో కేంద్రంపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే కన్షెషన్ రద్దు చేయండం, ప్యాకేజీ ఫుడ్ ఐటెమ్స్ మీద జీఎస్టీ, అగ్నిపథ్ నియామక ప్రకటన.. ఇలా దాదాపు చాలావరకు కేంద్ర నిర్ణయాలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు -
ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కూడా చేస్తోంది. మువ్వన్నెల పతాక రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరపాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కానీ జాతీయ జెండాను ఎగురవేయాలన్నా, మరే విధంగానైనా త్రివర్ణ పతాకాన్ని వాడుకోవాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించనట్లైతే చట్టం రూపొందించిన ప్రకారం శిక్షలు, జరిమానాలను విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరవపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద చేతులకు మూడు రంగుల బ్యాండ్లతో అతివల ఆనంద హేల నియమాలివీ.. జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి. జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు. మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు. కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషా యం రంగు ఎడమ వైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు. జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు. జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదు. వివిధ అలంకరణ సామగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించరాదు. పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ పైన కుడి వైపున మాత్రమే (ప్రేక్షకులకు ఎడమ వైపుగా) జెండాను నిలపాలి. జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. పతాకం మధ్యలో పూలను వాడవచ్చు. వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు. దుస్తులుగా కుట్టించకూడదు. -
హర్ ఘర్ తిరంగా ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ‘హార్ ఘర్ తీరంగా’ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వాప్తంగా కోటి జాతీయ జెండాలు ఎగరేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలో హార్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 12న జరిగే హార్ ఘర్ తిరంగాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే కోటి జెండాలను వివిధ శాఖల ద్వారా కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది. కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జెండా ఎగిరేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.